Varanasi:దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. “ఆర్ఆర్ఆర్” తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాల నెలకొన్నాయి. సినిమా కథ ఏంటి..? నటీనటులు పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? విజువల్స్ కు సంబంధించిన విషయాలు ఏంటి..? అనే చిన్న సమాచారమైన సరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇందులో ఒక పాన్ ఇండియా స్టార్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు అనే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.
భారీతారాగాణంతో వారణాసి :
మహేష్ బాబు కెరీర్ లో 29వ చిత్రంగా రూపొందుతున్న వారణాసి (Varanasi)లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ సినిమాలో విలన్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర వెరీ వెరీ హైలెట్ గా ఉండబోతుంది అంటూ టాక్. అడ్వెంచర్, యాక్షన్ అంశాలను భారీ స్థాయిలో ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. పలు కాలాలను విభిన్న ప్రపంచాలను అనుసంధానం చేస్తూ రాజమౌళి కొత్త తరహా కథనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు అని ప్రచారం జరుగుతుంది.
ALSO READ:Kiran Abbavaram:కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ?
మహేష్ బాబు శ్రీరాముడిగా :
వారణాసిలో త్రేతా యుగానికి సంబంధించిన ఒక కీలకమైన ఎపిసోడ్ ఉంటుంది అని గతంలోనే వార్తలు వినిపించాయి. ఈ భాగంలో మహేష్ బాబుని రాజమౌళి ఏకంగా శ్రీరాముడి పాత్రలు చూపించబోతున్నారు అనే ప్రచారం గట్టిగా జరిగింది. . అయితే ఈ విషయంపై ఇప్పటివరకు చిత్ర బృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ALSO READ:OTT:ఈ వారం ఓటీటీలోకి 22 మూవీస్..!
హనుమంతుడిగా రామ్ చరణ్ :
లేటెస్ట్ గా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామాయణ నేపథ్య ఎపిసోడ్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబుని శ్రీరాముడిగా చూపించే ప్రయత్నం చేస్తున్న రాజమౌళి ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వేగంగా ట్రెండ్ అవుతుంది. అయితే ఇది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్త మాత్రమే దీనిపై మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక స్పష్ట ప్రకటన రాలేదు.
హనుమంతుడి పాత్రకు కావాల్సిన శక్తివంతమైన స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ ఇమేజ్, బాడీ లాంగ్వాజ్ కు రామ్ చరణ్ 100% సరిపోతాడు అని రాజమౌళి భావిస్తున్నారట. తొలుత ఈ పాత్ర కోసం వేరే స్టార్ హీరోని అనుకున్నప్పటికీ రామ్ చరణ్ లుక్స్, రాంచరణ్ బాడీ రాజమౌళికి బాగా నచ్చేసి హనుమంతుడి పాత్రలో రామ్ చరణ్ ని ఫిక్స్ చేశారట. ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అంటూ తెలుస్తుంది. అఫీషియల్ ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఎప్పుడెప్పుడు అఫీషియల్ ప్రకటన వస్తుందా..? అంటూ ఫ్యాన్స్ వెయిటింగ్.




