Hero Vikram: కోలీవుడ్ , టాలీవుడ్ ప్రేక్షకులకు స్టార్ హీరో విక్రమ్ గురించి, ఆయనకు ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన కథలో ఎప్పుడూ కూడా కొత్తదనం ఉండేలా చూస్తూ ఉంటారు. సినిమా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తూ ఉండే విక్రమ్ ఎప్పుడూ కూడా వివాదాలలో విక్రమ్ పేరు వినిపించలేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆయన పోస్టులు షేర్ చేసేది కూడా చాలా అరుదని చెప్పవచ్చు. తాజాగా ఒక వీడియో షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అరుదైన లార్ గిబ్బన్ అనే ఒక విదేశీ జాతి కోతితో సరదాగా గడుపుతున్న వీడియోని సైతం షేర్ చేశారు విక్రమ్.
సరదా వీడియో తెచ్చిన తంటా..
అయితే ఈ వీడియో వల్ల విక్రమ్ (Hero Vikram)చిక్కుల్లో పడ్డట్టుగా వినిపిస్తోంది. లార్ గిబ్బన్ జాతికి చెందిన కోతిని పెంచుకోవడం చట్టపరంగా విరుద్ధమని, కొంతమంది జర్నలిస్టులు వన్యప్రాణి సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవంగా ఈ విదేశీ జాతి కోతి విక్రమ్ దగ్గర లేదని ఆయన వియ్యంకుడు కెవిన్ కేర్ వ్యవస్థాపక చైర్మన్ రంగనాథన్ దగ్గర ఉన్నదట. ఇండోనేషియా కు లార్ గిబ్బన్ కోతిని తెప్పించారని ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మణిపూర్ మీదుగా ఈ రోడ్ కు అక్కడి నుంచి చెన్నైలోని రంగనాథన్ ఇంటికి తరలించినట్లుగా వినిపిస్తున్నాయి.
also read:Kamakshi Bhaskarla :9 ఏళ్ల కష్టం..ఇప్పుడు అవకాశం.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్!
రంగంలోకి జంతు సంరక్షణ అధికారులు..
లార్ గిబ్బన్ కోతి అంతర్జాతీయ వన్యప్రాణి నియంత్రణ చట్టం పరిధిలోకి వస్తుంది. అలాగే జంతు సంరక్షణ కిందకి కూడా వస్తుంది. ఈ విదేశీ జాతి కోతికి సంబంధించి తగిన పత్రాలు అనుమతులు లేకుండా ఇలాంటివి పెంచుకోవడం చట్టరీత్యా నేరమని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. హీరో విక్రమ్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కూడా వైరల్ గా మారడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యి వెంటనే ఈ అంశం పైన విచారణని మొదలుపెట్టారు.
also read:MS Raju: సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని విషయం బయటపెట్టిన ఎంఎస్ రాజు..!
విక్రమ్ చియాన్ సినిమాలు..
లార్ గిబ్బన్ ను ఇంట్లో పెంచుకునేందుకు అవసరమైన అనుమతులు, సంబంధిత పత్రాలు ఉన్నాయో లేదో అనే విషయం పైన అటవీశాఖ అధికారులు కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఈ అంశం వివాదాస్పదం కావడం వల్ల హీరో విక్రమ్ షేర్ చేసిన ఆ వీడియో 24 గంటల్లోనే డిలీట్ చేసినట్లు తెలుస్తోంది . ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చియాన్ విక్రమ్ సినిమాల విషయానికే వస్తే. వీర ధీర శూర చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే రాబట్టింది. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అలాగే విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
நடிகர் விக்ரம் தனது இன்ஸ்டாகிராம் பக்கத்தில் பகிர்ந்த அரிய வகை ‘லார் கிப்பன்’ (#LarGibbon) குரங்குடன் விளையாடும் வீடியோ வைரலானதை அடுத்து, தமிழ்நாடு வனத்துறை விசாரணைக்கு உத்தரவிட்டுள்ளதால் அந்தப் பதிவு நீக்கப்பட்டுள்ளது.#Actor #vikram pic.twitter.com/YNiXjY1eFw
— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) August 11, 2026




