OTT:సినిమా థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలతో పాటు ఓటీటీ(OTT) వేదికలపై వచ్చే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం వరకు పలు ఓటీటీ ప్లాట్ఫామ్ లలో కొత్త కంటెంట్ అందుబాటులోకి రానుంది. నెట్ఫ్లిక్స్ నుంచి జియో హాట్స్టార్ వరకు ఏ వేదికలో ఏ సినిమా వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు చూద్దాం
నెట్‌ఫ్లిక్స్‌లో “ప్యార్ ప్రేమ కళ్యాణం” :
నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ వారం “ప్యార్ ప్రేమ కళ్యాణం” సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, పెళ్లి చుట్టూ సాగే కధాంశంతో రూపొందిన ఈ సినిమా కోసం ఓటిటి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 21 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ లో ‘గుడ్ ఫార్చూన్’..:
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘గుడ్ ఫార్చూన్’.. అనే కామెడీ ఫిలిం స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. వినోదానికి ప్రాధాన్యం ఇచ్చే ఈ చిత్రం ఓటిటిలో నవ్వులు పంచేందుకు రెడీ అయింది. ఆగస్టు 21 నుంచి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
జియో హాట్ స్టార్ లో ‘గ్రీన్ ల్యాన్‌టర్న్’:
జియో హాట్ స్టార్ లో సూపర్ హీరో నేపథ్యంలో తెరకెక్కిన “గ్రీన్ ల్యాన్‌టర్న్” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ సూపర్ హీరో కధలని ఇష్టపడే వారికి ఈ సిరీస్ బాగా ఆసక్తికరంగా నిలవనుంది. ఆగస్టు 16 నుండి ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ తెలుగు, ఇంగ్లీష్ భాషలో కూడా అందుబాటులో ఉంది.
ALSO READ:Rashmika mandanna: రష్మిక వ్యాఖ్యలపై యశ్ ఏమన్నారంటే..?
“ఐ నో బడి” తో మరోసారి ఓటిటి సందడి:
జియో హాట్ స్టార్ లో “ఐ నో బడి” సినిమా కూడా స్ట్రీమింగ్ కు రానుంది. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఓటీటీలో చూసేందుకు ఎదురు చూసే ప్రేక్షకులకు ఇది మరొక ఆసక్తికరమైన కంటెంట్ అని చెప్పవచ్చు. ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ సినిమా జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి రానుంది.
ALSO READ:Bigg Boss 10:బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో శ్రీముఖి టంగ్ స్లిప్..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!
“వెల్కమ్ టు ది జంగిల్” ఎప్పుడు..?
కామెడీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తెరకెక్కిన “వెల్కమ్ టు ది జంగిల్” కూడా ఈ వారం ఓటీటీలోకి రానుంది. తెలుగు, హిందీ భాషలలో అందుబాటులోకి రానున్న ఈ సినిమాను ఆగస్టు 21 నుంచి జనాలు జియో హాట్ స్టార్ లో చూడవచ్చు.
ఆపిల్ టీవీ ప్లస్ లో “స్టిల్ వాటర్: సీజన్ 5”:
వెబ్ సిరీస్ అభిమానులకు “స్టిల్ వాటర్ : సీజన్ 5” మరో ఆసక్తికరమైన విడుదల అని చెప్పవచ్చు. ఈ సీరిస్ కొత్త సీజన్ ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ ను ఫాలో అవుతున్న వారికి కొత్త సీజన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది ఆపిల్ టీవి ప్లస్ లో ఆగస్టు 21వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.
సోనీ లివ్ లోను “స్టిల్ వాటర్” :
సోనీ లివ్ వేదికకు సంబంధించిన జాబితాలోను స్టీల్ వాటర్ సీజన్ 5 ఆగస్టు 21న విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఒకే సిరీస్ కు సంబంధించిన రెండు వేరువేరు వేదికలు ఈ సిరీస్ ను దక్కించుకున్నట్లు తెలుస్తుంది.
ఈవారం ఓటీటీలో ముఖ్యమైన విడుదలలు :
ఆగస్టు 16 నుండి 21 మధ్య ఓటీటీ ప్రేక్షకుల కోసం పలు సినిమాలు అదేవిధంగా వెబ్ సిరీస్ లు జనాలను అలరించేందుకు సిద్ధమయ్యాయి. గ్రీన్ ల్యాన్‌టర్న్, ఐ నోబడి, ప్యార్ ప్రేమ కళ్యాణం, గుడ్ ఫార్చూన్, వెల్కమ్ టు ద జంగిల్ ,స్టీల్ వాటర్ సీజన్ 5 వంటి కంటెంట్ వివిధ వేదికల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో మీకు నచ్చిన సినిమాలు ఎంపిక చేసుకొని ఈ వారం ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు..!!




