Rashmika mandanna: కన్నడ హీరో యశ్ తాజాగా టాక్సిక్ సినిమాలో నటించారు. ఆగస్టు 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ పోస్టర్స్ సైతం సినిమా పైన అంచనాలను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించడం గమనార్హం. ఇందులో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హూమా ఖురేషి , తారా సుతారియా తదితర సెలబ్రిటీలు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న యశ్ 2016 లో కిరిక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక(Rashmika mandanna) ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యింది.
రష్మికపై ట్రోల్స్..
ఆ సమయంలో హీరో యశ్ పై చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. యశ్ అభిమానులు కూడా రష్మిక పైన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ విషయం పైన రష్మిక బహిరంగంగానే యశ్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పింది. తన వ్యాఖ్యల పైన వివరణ ఇస్తూ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. రష్మిక ఒక టీవీ షోలో పాల్గొన్నప్పుడు” యశ్ షో ఆఫ్” అంటూ కామెంట్ చేసింది.ఈ వ్యాఖ్యల పైన ఎప్పుడు కూడా యశ్ స్పందించలేదు. టాక్సిక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో ఇస్తున్న యశ్ ,రష్మిక కామెంట్స్ పైన స్పందించారు.
also read:Bigg Boss 10:బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో శ్రీముఖి టంగ్ స్లిప్..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!
అసలు ఏం జరిగిందంటే?
ఆమె ఎటువంటి సందర్భంలో ఆ కామెంట్ చేసిందో నాకు తెలియదు..అప్పట్లో ఆమె ఇండస్ట్రీకి కొత్త, కొన్ని టీవీ షోలలో యాంకర్స్ రెండు మూడు ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకదానిని ఎంచుకోమంటారు.. ఆ ఆప్షన్లలో నాకు ఇది సరిపోతుందని రష్మిక భావించి ఉండవచ్చు.. నేను మాత్రం అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోను.. ఎవరి అభిప్రాయం వాళ్లదే అంటూ యశ్ తెలియజేశారు. అయితే రష్మిక చేసిన కామెంట్స్ పైన యశ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు. ఈ విషయం పైన కూడా యశ్ స్పందిస్తూ ఒక మంచి సందేశం ఇచ్చారు. మీరు మరో నటుడిని లేదా నటుడిని గౌరవించకపోతే మీరు నా అభిమానులే కాలేరు అంటూ తెలియజేశారు.
also read:Ananya Raj: 27 ఏళ్ల వయసుకే కన్నుమూసిన టాలీవుడ్ హీరోయిన్!
పదేళ్ల తర్వాత స్పందించిన యశ్..
సుమారుగా 10 ఏళ్ల క్రితం రష్మిక అన్న వ్యాఖ్యలకు హీరో యశ్ ఇప్పుడు స్పందించడంతో పాటుగా ఎట్టకేలకు ఇలాంటి విషయాలకు ముగింపు పలకడంతో రష్మిక అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయం పైన హీరోయిన్ రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. యశ్ బాలీవుడ్ లో రాబోతున్న రామాయణం సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా 2026 దీపావళి కానుకగా మొదటి భాగాన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో రావణుడి పాత్రలో కనిపించబోతున్నారు.




