Bigg Boss 10:తెలుగు బుల్లితెరపై భారీ క్రేజ్ ఉన్న బిగ్ బాస్ రియాలిటీ షో పదో సీజన్ కోసం కామనర్లను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ‘బిగ్ బాస్ 10(Bigg Boss 10) అగ్నిపరీక్ష’ ప్రారంభమైన కొద్ది రోజులకే వివాదాలకు వేదికగా మారింది. ఆగస్టు 15 నుంచి ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ బాలు చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు యాంకర్ శ్రీముఖి వ్యవహారశైలిపై కూడా నెటిజన్లు పలు ప్రశ్నలు, విమర్శలు చేస్తున్నారు. షోలో జరుగుతున్న పరిణామాలు, కంటెస్టెంట్ల మధ్య చోటుచేసుకుంటున్న విభేదాలు ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. దీంతో అగ్నిపరీక్ష కార్యక్రమం ప్రారంభంలోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఎవరి నోట విన్న సరే ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు.
నవదీప్ పై ఉప్పల్ బాలు ఆరోపణలు:
సోషల్ మీడియాలో విభిన్న వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఉప్పల్ పాలు అగ్నిపరీక్షలో ఫైనల్ దశ వరకు చేరుకున్నారు. అయితే చివరి దశలో తనను ఎలిమినేట్ చేయడం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు అన్యాయం జరిగింది అని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముఖ్యంగా షోలో తనను అవమానించారు అని.. తాను చేసే వీడియోలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉప్పల్ బాలు ఆరోపించారు. ఈ విషయంలో షో నిర్వాహకులతో పాటు జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్ పైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
also read:Ananya Raj: 27 ఏళ్ల వయసుకే కన్నుమూసిన టాలీవుడ్ హీరోయిన్!
రన్నింగ్ రాజా విషయంలో శ్రీముఖిపై విమర్శలు:
మరోవైపు యాంకర్ శ్రీముఖి వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. రన్నింగ్ రాజా అనే కంటెస్టెంట్ ఆడిషన్ సమయంలో శ్రీముఖిని ఇమిటేట్ చేయాలి అని జడ్జిలు సూచించారు. దీంతో అతను తనకు సాధ్యమైన రీతిలో ఆమెను అనుకరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రన్నింగ్ రాజా శ్రీముఖి వద్దకు వెళ్లగా ఆమె అతన్ని దూరంగా ఉండాలి అని హెచ్చరించింది..అంతేకాదు తాకేందుకు ప్రయత్నిస్తే చంప పగలగొడతా అంటూ స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
also read:Rukmini Vasanth: గ్లామర్ తో హీట్ పుట్టిస్తున్న రుక్మిణీ వసంత్!
మర్యాదగా వ్యవహరించాలంటూ నెటిజన్లు:
ఈ ఘటనపై కొందరు నెటిజన్లు శ్రీముఖి తీరును తప్పుపడుతున్నారు. ఆడిషన్ కు వచ్చిన వారిని ప్రోత్సహించాల్సింది పోయి అవమానించేలా వ్యవహరించడం సరికాదు అని కామెంట్లు చేస్తున్నారు. ఏ అభ్యర్థి విషయంలోనైనా విమర్శలు లేదా సూచనలు మర్యాదపూర్వకంగానే ఉండాలి అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉప్పల్ బాలు ఆరోపణలు, శ్రీముఖి పై విమర్శలతో అగ్నిపరీక్ష కార్యక్రమం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది శ్రీముఖీ అతడికి సారీ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదాలపై షో నిర్వాహకులు సంబంధిత వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..
Sreemukhi unna koncham respect kooda poindi epudoo anni rojulu manave kaavu, koncham Andaritho normal gaa behave chey 🙏🙏 https://t.co/CkCL4Js6Kc
— McDowell Murthy (@SarleNuvvelluuu) August 16, 2026




