Monday, August 17, 2026
HomeLATESTBigg Boss:"బిగ్ బాస్‌లో గిఫ్టుల పేరుతో మోసం"..మనసులోని బాధని కక్కేసిన పల్లవి ప్రశాంత్..!

Bigg Boss:”బిగ్ బాస్‌లో గిఫ్టుల పేరుతో మోసం”..మనసులోని బాధని కక్కేసిన పల్లవి ప్రశాంత్..!

Bigg Boss:బిగ్ బాస్ షోలో గిఫ్టుల పేరుతో మోసం జరిగిందంటూ మాజీ విన్నర్ పల్లవి ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

on
- Advertisement -banner Ad

Bigg Boss:”పల్లవి ప్రశాంత్”.. ఈ పేరు ఎంత త్వరగా లైమ్ లైట్ లోకి వచ్చిందో అంతే త్వరగా ట్రోలింగ్ పాలైంది. బిగ్ బాస్ లోకి రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలవడం అప్పట్లో పెద్ద చర్చనీయంసంగా మారింది. తాజాగా బిగ్ బాస్ పై రైతు బిడ్డగా ట్యాగ్ చేయించుకున్న పల్లవి ప్రశాంత్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ లో కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ అనే ట్యాగ్ తో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ పొందాడు.

చివరకు టైటిల్ విజేతగా నిలిచాడు. విజయం సాధించిన సమయంలో తనకు లభించిన ప్రైజ్ మనీని రైతులకు సహాయం చేసేందుకు ఉపయోగిస్తాను అని పల్లవి ప్రశాంత్ ప్రకటించాడు. అప్పట్లో ఇది ఓ సెన్సేషన్ గా మారింది. అందరూ అతగాడిని ఒక హీరోలా చూసారు. అయితే ఆ తర్వాత రైతులకు ఆర్థిక సహాయం చేయలేదు అంటూ సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురయ్యారు. ఈ అంశంపై ఇప్పటికి ట్రోలింగ్ ఎదుర్కొంటున్న పల్లవి ప్రశాంత్ తాజాగా తనపై వస్తున్న విమర్శలకు స్పందించాడు.

- Advertisement -
Advertisement

ప్రైస్ మనీ పై పల్లవి ప్రశాంత్ వివరణ :

బిగ్బాస్(Bigg Boss) ద్వారా ప్రకటించిన రూ.35 లక్షల ప్రైజ్ మనీ తన చేతికి రావడానికి కొంత సమయం పట్టిందని పల్లవి ప్రశాంత్ తెలిపాడు. ఆ మొత్తంలో దాదాపు 40 శాతం జీఎస్టీ రూపంలో కట్టయ్యింది అని చెప్పాడు. డబ్బులు ఆలస్యంగా రావడంతో పరిస్థితి తెలియని కొందరు తనను విమర్శించారు అని ఆవేదన వ్యక్తం చేశాడు.

ALSO READ:OTT:రహస్యాలు, కోరికలు, సంబంధాలు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘డార్క్ సీక్రెట్స్’..!

- Advertisement -
Advertisement

కారు, నెక్లెస్ విషయంలో షాకింగ్ కామెంట్స్ :

బిగ్బాస్ లో గిఫ్టుగా కారు ఇస్తామని చెప్పిన దానిని తీసుకోవాలి అంటే సుమారు రూ.8.7 లక్షలు చెల్లించాల్సివచ్చిందని పల్లవి ప్రశాంత్ ఆరోపించాడు. ఆ మొత్తాన్ని చివరకు ప్రైజ్ మనీ నుంచే తీసుకుంటామని చెప్పారని వివరించాడు. అలాగే నెక్లెస్.. టీం గిఫ్టుగా ఇస్తామని చెప్పి తర్వాత దానికి సుమారు రూ.5 లక్షలు చెల్లించాలి అని చెప్పారని పేర్కొన్నాడు. ఇది గిఫ్ట్ ట్యాహ్స్ అని నిర్వాహకులు వివరించారు అని తెలిపాడు. ముందుగా చెప్పిన విషయాలకు చివరికి తనకు అందిన వాటికి చాలా తేడా ఉంది అంటూ పల్లవి ప్రశాంత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ALSO READ:TV:సోమవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

- Advertisement -
Advertisement

సోషల్ మీడియాలో వైరల్ :

పల్లవి ప్రశాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రైజ్ మనీ పై పన్నులు విధించడం సాధారణమే అయిన గిఫ్ట్ గా ప్రకటించిన కారు, నెక్లెస్ కి కూడా అదనంగా డబ్బులు చెల్లించాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అని కొందరు నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం బిగ్ బాస్ నిబంధనలను ముందుగానే తెలుసుకోవాల్సిన బాధ్యత కంటెస్టెంట్లదేనని అభిప్రాయపడుతున్నారు. ఈ ఆరోపణలపై బిగ్ బాస్ నిర్వహకులు ఎలా స్పందిస్తారో చూడాలి..???

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you