Ram Charan:గత కొంతకాలంగా హిట్స్ కోసం పరితపిస్తున్న మాస్ మహారాజ రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తిసుకుని నటించిన సినిమా “ఇరుముడి”. ఇప్పటివరకు రవితేజ తన కెరీర్‌లో టచ్ చేయని జోనర్‌ను ఈ సినిమా ద్వారా టచ్ చేశారు. ఇరుముడి సినిమా పూర్తి డివోషనల్‌గా, అదేవిధంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తుంది. రవితేజ ఈ సినిమాతో మళ్లీ కంబ్యాక్ చేస్తాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 21వ తేదీన థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. రవితేజ సినిమాకి సంబంధించి ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ ప్రవర్తించకుండా టీం మంచి ఎఫర్ట్స్‌తో ప్రమోషన్స్ కంటిన్యూ చేస్తుంది.
ట్రైలర్ సినిమాపై పూర్తి హైప్ :
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై పూర్తి హైప్ పెంచేసింది. చాలా కాలం తర్వాత రవితేజ ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మూమెంట్‌లోనే ఇరుముడి సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్‌గా మారింది. గ్లోబల్ స్టార్ మెగా పవర్ హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‌లో మెరవబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇరుముడిలో అయ్యప్ప స్వామి మాల ధరించిన వ్యక్తిగా రవితేజ కనిపించనున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే.
also read:Sai Dharam Tej:రూల్స్ బ్రేక్ చేసిన మెగా హీరో..అడ్డంగా దొరికేశాడు పో..!
పాటలో రామ్ చరణ్ ఎమట్రీ:
సినిమాలో మల్లెపూల పల్లకి పాట కూడా ఉంది. అందులో రామ్ చరణ్ అతిథి పాత్రలో సందడి చేయబోతున్నారు అని ఓ వార్త షికారు చేస్తుంది. చిరుతనయుడికి అయ్యప్ప స్వామి అంటే ఎంత భక్తో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంవత్సరానికి మూడు, నాలుగు సార్లు అయ్యప్ప స్వామి మాల వేస్తూనే ఉంటారు. దైవభక్తి ఎక్కువ రామ్ చరణ్‌కి. మరీ ముఖ్యంగా అయ్యప్ప స్వామి అంటే మరీ మరీ ఇష్టం. ఆ కారణంగానే అయ్యప్ప స్వామి మాల వేస్తూ ఉంటారు. అందువల్ల ఇరుముడిలో అతిథి పాత్ర చేయడానికి ఓకే చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇది కేవలం వైరల్ అవుతున్న వార్త మాత్రమే. దీనికి సంబంధించి అటు రామ్ చరణ్ కానీ, ఇటు రవితేజ కానీ, ఇరుముడి సినిమా టీం నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపడేస్తున్నారు.
also read:Irumudi:ఇరుముడి సినిమాలో ఆ 40 నిమిషాలే హైలెట్..!
అసలు నిజం ఇదే:
మరికొంతమంది మాత్రమే ఇది సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్ అని, అందుకే ఇలా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు. అసలు నిజంగా రవితేజ ఇరుముడి సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గెస్ట్ రోల్‌లో కనిపిస్తున్నాడా? ఇది కేవలం ఫేక్ వార్తేనా? తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సిందే. లేదంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం రామ్ చరణ్ ఇరుముడి సినిమాలో నటిస్తున్నాడు అన్న ప్రచారం జోరందుకుంది. దీంతో సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ దొరికేసింది అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రవితేజ ఎన్నిసార్లు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు అందరికీ తెలిసిందే. ఇప్పుడు రవితేజ హిట్ కోసం మెగా పవర్ స్టార్ ఆ మాత్రం చేయలేడా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుంది అనేది..??




