Tuesday, August 18, 2026
HomeLATESTNagababu:ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా నాగబాబు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు!

Nagababu:ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా నాగబాబు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు!

Nagababu:ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా నియమితులైన జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

on
- Advertisement -banner Ad

Nagababu:ఫైనల్లీ మెగా అభిమానుల కల నెరవేరిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సోషల్ మీడియాలో, ఏపీ రాజకీయ వర్గాలలో ఎక్కువగా ఒక టాపిక్ వినిపించింది. అదే నాగబాబు పేరు. నాగబాబుకి ఏ పదవి ఇవ్వలేదా? నాగబాబుని ఎందుకు దూరం పెడుతున్నారు? అనే విధాలుగా రకరకాలుగా మాట్లాడుకున్నారు.

నాగబాబుకు కీలక పదవి:

ఫైనల్లీ అవన్నింటికీ చెక్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాతో కూడిన కీలక పదవి నాగబాబుకి దక్కింది. ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా ఏపీ ప్రభుత్వం మెగా బ్రదర్ నాగబాబుని నియమించింది. దీనిపై నాగబాబు స్పందించారు.

- Advertisement -
Advertisement

సీఎం, పవన్‌కు కృతజ్ఞతలు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాతో కూడిన కీలక పదవి దక్కిన అనంతరం జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)స్పందించారు. ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా తనను నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నాగబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన సోదరుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కూడా ధన్యవాదాలు చెప్పారు.

సోషల్ మీడియా వేదికగా నాగబాబు తన స్పందనను వెల్లడించారు. ప్రభుత్వం తనకు అప్పగించిన ఈ బాధ్యతను ఎంతో గౌరవంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ పదవిని కేవలం ప్రోటోకాల్‌కు సంబంధించిన హోదాగా చూడటం లేదని, రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడిన గురుతర బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి, భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించే దిశగా తన వంతు కృషి చేస్తానని నాగబాబు స్పష్టం చేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన కృతజ్ఞతలను తెలిపారు. ఈ పదవిని కేవలం ఒక ప్రోటోకాల్‌గా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం అప్పగించిన గురుతర బాధ్యతగా భావిస్తున్నట్లు నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
Advertisement

పర్యావరణ పరిరక్షణకు కృషి:

అంతేకాదు, మొక్కలు నాటడం తన జీవనశైలిలో ఒక భాగం అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నూతన బాధ్యతతో ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా, అదేవిధంగా ఆరోగ్యవంతంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తానని, ఎక్కడా తప్పులు దొర్లకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజాభాగస్వామ్యాన్ని పెంపొందించేలా, మీరు నాకు ఇచ్చిన ఈ బాధ్యతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటాను అని నాగబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం నా వంతుగా పూర్తిస్థాయిలో శ్రమిస్తానని మాట ఇస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

నాగబాబుకు అభినందనలు:

దీంతో జనసేన నాయకులు, నాగబాబు ఫ్యాన్స్, మెగా అభిమానులు ఆయనకు విషెస్ అందిస్తున్నారు. ఖచ్చితంగా నాగబాబు తన పదవికి మంచి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you