Balakrishna:నందమూరి బాలకృష్ణ మొదటి నుంచి తాను చేసే సినిమా వృత్తి పట్ల చాలా అంకితభావం కలవారు. ముఖ్యంగా తన తండ్రి ఎన్టీఆర్ నుంచి అది వారసత్వంగా వచ్చిందని చెప్పవచ్చు. తాజాగా బాలయ్య తన 111వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఒక యాక్షన్ సీన్ షూటింగ్ చేస్తూ ఉండగా , ప్రమాదం జరిగిన సంఘట తెలిసిందే. దీంతో ఆయన మోకాలికి గాయం అవ్వడం చేత వైద్యులు సైతం శస్త్ర చికిత్స అవసరమని తెలియజేశారు. దీంతో ఆపరేషన్ చేయించుకున్న బాలయ్య వైద్యులు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
సెప్టెంబర్ లో షూటింగ్లో పాల్గొననున్న బాలయ్య..
కానీ బాలయ్య మాత్రం సెప్టెంబర్ నెల నుంచి షూటింగ్లో పాల్గొనడానికి మక్కువ చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ మాసంలో తనకు సంబంధించిన షూటింగ్ని పూర్తి చేయాలని భావిస్తున్నారట. అలా చిత్రీకరణ పూర్తి కాగానే అక్టోబర్లో సినిమా ప్యాచ్ వర్క్ పూర్తిచేసి, నవంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ ని మొదలు పెట్టాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే డిసెంబర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలనే ఆలోచనతో బాలయ్య ఉన్నట్లుగా వినిపిస్తోంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జోడిగా మరోసారి కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
also read:jailer 2:జైలర్ 2 చిత్రానికి రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
బాలయ్య మూవీకి డిసెంబర్ నెల కలిసొస్తుందా?
బాలయ్యకు డిసెంబర్ మాసం బాగానే కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఆయన కెరియర్ లో మొదటిసారి భారీ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రం పట్టాభిషేకం. ఆ తర్వాత లారీ డ్రైవర్ , అఖండ వంటి చిత్రాలు డిసెంబర్లోనే విడుదలయ్యాయి. అందువల్లే డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న రెండవ చిత్రాన్ని డిసెంబర్ లోనే విడుదల చేసేలా బాలయ్య ప్లాన్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ చిత్రాన్ని జనవరిలో సంక్రాంతి బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నారంటూ రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ విషయానికి చెక్ పెట్టేలా తెలుస్తుంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ నెలలో ప్రభాస్ ఫౌజీ సినిమా , షారుక్ ఖాన్ కింగ్ తో పాటుగా మరో రెండు హాలీవుడ్ సినిమాలు రాబోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాలయ్య సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారేమో చూడాలి మరి.
also read:Nidhhi Agerwal:ఈడీ అధికారుల ముందు హాజరైన నిధి అగర్వాల్..!
బాలయ్య నిర్ణయానికి అభిమానులు ఫిదా..
ఇక బాలయ్యకు(Balakrishna) ఇలాంటి ప్రమాదాలు కొత్తేమి కాదు.. తన కెరియర్ ప్రారంభంలో బాబాయ్ అబ్బాయి షూటింగ్లో ఆ తర్వాత భార్య భర్తల బంధం సినిమా షూటింగ్లో కూడా గాయాల పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ మోకాలకి ప్రమాదం జరగడంతో వైద్యులు రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. కానీ బాలయ్య మాత్రం తన ఆరోగ్యం కుదుటపడిందని. నిర్మాతలకు ఇబ్బంది కలగకూడదని షూటింగ్లో త్వరలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది. గతంలో కూడా పలు సినిమాల సమయంలో నిర్మాతలకు నష్టం కలగకుండా ఉండేందుకు సినిమా షూటింగ్లలో పాల్గొనేవారు బాలయ్య. దీంతో బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయం చూసి అభిమానులు అభినందిస్తున్నారు.




