Wednesday, August 19, 2026
HomeLATESTjailer 2:జైలర్ 2 చిత్రానికి రూ.160 కోట్ల ఓటీటీ డీల్?

jailer 2:జైలర్ 2 చిత్రానికి రూ.160 కోట్ల ఓటీటీ డీల్?

jailer 2: నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న రజినీకాంత్ జైలర్ 2 సినిమాకు భారీ ఓటీడీలు కుదిరినట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

jailer 2:సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా రజనీకాంత్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు కొన్ని కంపెనీలు ఏకంగా సెలవు దినాన్ని కూడా ప్రకటిస్తాయి. అంతలా దేశవ్యాప్తంగా రజనీకాంత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లో వచ్చిన జైలర్ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

జైలర్ 2 ఓటీటీ డీల్..

ఇప్పుడు తాజాగా జైలర్2( jailer 2) సినిమాకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. థియేటర్లోకి ఇంకా ఈ సినిమా అడుగుపెట్టక ముందే ఏకంగా 160 కోట్ల ఓటిటి డీల్ దక్కించుకున్నట్లు వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ ఏడాది అత్యధికంగా భారీ నాన్ థియేట్రికల్ డీల్స్ కుదుర్చుకున్న చిత్రంగా రజనీకాంత్ సినిమా సరికొత్త రికార్డును సృష్టించే అవకాశాలు ఉన్నాయి. జైలర్ సినిమాలో ముత్తువేల్ పాండియన్ పాత్రలో అద్భుతంగా కనిపించారు రజినీకాంత్ ఇప్పుడు అదే పాత్రను కొనసాగిస్తూ సీక్వెల్ ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Nidhhi Agerwal:ఈడీ అధికారుల ముందు హాజరైన నిధి అగర్వాల్..!

అఫీషియల్ అనౌన్స్మెంట్?

సినీ వర్గాల నుంచి అందుతున్న ప్రకారం .. జైలర్ 2 సినిమాకి సంబంధించి రూ .160 కోట్ల ఓటీటి డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. అయితే ఏ సంస్థతో ఒప్పందం కుదిరింది అనే విషయం మాత్రం ఇంకా వెలబడలేదు. దీనిపైన మరి అఫీషియల్ గా చిత్ర బృందం ఏదైనా ప్రకటిస్తుందేమో చూడాలి మరి. ఇప్పటికే జైలర్ 2 చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమా అంచనాలను మరింత పెంచేసాయి. జైలర్ 2 సినిమా అక్టోబర్ 15 దసరా సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మొదట ఈ సినిమాని ఆగస్టు 21 న విడుదల చేయాల్సి ఉండగా , కొన్ని కారణాల చేత వాయిదా ప్రకటించారు.

- Advertisement -
Advertisement

also read:TV:బుధవారం టీవీలో సినిమాల జాతర.. ఏ ఛానల్‌లో ఏ సినిమా అంటే?

జైలర్ 2లో భారీ తారాగణం..

జైలర్ 2 లో కూడా భారీగానే తారాగణం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ, యోగిబాబు, మీర్నా, సంతానం, మేఘన రాజ్ సర్జ, భగవతి పెరమూల్ తదితర నటీనటులు కనిపించబోతున్నారు. అలాగే మోహన్లాల్, విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ వంటి దక్షిణాది స్టార్లతో పాటు హృతిక్ రోషన్ కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలన్నీ నిజమైతే కనుక రజనీకాంత్ జైలర్ 2 సినిమా సరికొత్త రికార్డులను తిరగరాస్తుందని చెప్పవచ్చు. మరి ఏంటి అన్నది చిత్ర బృందం ట్రైలర్ తో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. రజనీకాంత్ తదుపరి ప్రాజెక్టుల విషయానికి వస్తే.. కమలహాసన్ బ్యానర్ లో ధర్మన్ అనే సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you