Ramdev Baba:”కంగనా రనౌత్”.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంట్రవర్సీకి అడ్రస్‌గా నిలుస్తూ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కంగనా రనౌత్ నైజం. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఆమె మనసుకి ఏమనిపించిందో అదే మాట్లాడుతుంది. ఎదుట ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే పెద్దగా ఆలోచించరు. అందుకే కంగనా రనౌత్‌కు ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారో, శత్రువులు కూడా అంతేమంది ఉంటారు అని జనాలు అభిప్రాయపడుతుంటారు.
కంగనా–బాబా రాందేవ్ మధ్య మాటల యుద్ధం:
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్( Ramdev Baba), ప్రముఖ యోగా గురువు, పతాంజలి సంస్థల సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ మధ్య ప్రస్తుతం తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశంలోని యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ గతంలో చేసిన ‘జనరేషన్ గట్టర్’ వ్యాఖ్యలతో ఇరువురి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో నడుస్తుంది. తన వ్యాఖ్యలను తప్పుపడుతూ, వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపిస్తూ, గతాన్ని ప్రశ్నించిన బాబా రాందేవ్‌పై కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంతేకాదు, బాబా రాందేవ్‌కు తన వ్యక్తిత్వం గురించి నీతులు చెప్పవద్దంటూ హితవు పలికింది.
సుప్రీంకోర్టు మందలింపును గుర్తుచేసిన కంగనా:
అంతేనా.. పతాంజలి బ్రాండ్ తప్పుడు ప్రకటనల కేసులో 2024లో బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మందలించిన విషయాన్ని ఘాటుగా విమర్శిస్తూ గుర్తుచేసింది. తనపై ఎలాంటి మోసపూరితమైన ఆరోపణలు లేదా కేసులు రుజువు కాలేదని, కాబట్టి తన క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్ బాబా రాందేవ్‌కు లేదంటూ కంగనా రనౌత్ ఇచ్చి పడేసింది.
also read:OTT:ఘట్టమనేని జయకృష్ణ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడంటే?
‘జనరేషన్ గట్టర్’ వ్యాఖ్యలతో వివాదం:
గత నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేక విద్యార్థుల నిరసనలోని కొన్ని వీడియోలు చూసిన తర్వాత కంగనా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిరసనల్లో పాల్గొంటున్న యువత భాష, వారి ప్రవర్తన అసహ్యం కలిగించేలా ఉన్నాయని కంగనా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే యువతను ‘జనరేషన్ గట్టర్’ లేదా ‘వెస్ట్రనైజ్డ్ గ్యాంగ్’ అని కూడా పిలిచారు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది. తన వ్యాఖ్యలపై కంగనా వివరణ కూడా ఇచ్చారు.
also read:Bigg Boss:బిగ్‌బాస్‌ను మించిపోయిన అగ్నిపరీక్ష.. కంటెస్టెంట్లకు చుక్కలు!
కంగనాపై బాబా రాందేవ్ ఘాటు వ్యాఖ్యలు:
అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యోగా గురు బాబా రాందేవ్ కంగనా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా విమర్శించారు. ఆమె ఏంటి? ఆమె బాల్యం ఎక్కడ గడిచింది? ఆమె యవ్వనం ఎలా సాగింది? ఆమె గత చర్యలు, విజయాలు ఏంటి? అనే విధంగా ప్రశ్నిస్తూ.. కంగనాను ‘మురికి కాలువ’ అని పిలవడం ఒక కలుషితమైన మనస్తత్వానికి నిదర్శనం అంటూ బాబా రాందేవ్ కంగనాపై ఘాటుగా విమర్శించారు.

కంగనా రనౌత్ ఘాటు కౌంటర్:
“బాబాజీ.. నా యవ్వనం లేదా బెడ్రూమ్ గురించి పగటి కలలు కనడం ఆపేసేయండి. కేవలం పుకార్లు, గాసిప్‌ల ఆధారంగా మాత్రమే ఎవరైనా ఊహించగలరు. నా క్యారెక్టర్ మీ కంటే చాలా చాలా గొప్పది, మెరుగైనది. నా పేరు మీద ఎలాంటి ఫ్రాడ్ కేసులు లేవు, మీలాగా” అంటూ ఘాటుగా ఇచ్చి పడేసింది.




