Wednesday, August 19, 2026
HomeLATESTAnupama:మహిళగా పుట్టినందుకు సిగ్గుపడేలా చేశాడు.. మాజీ బాయ్ ఫ్రెండ్ పై అనుపమ షాకింగ్..!

Anupama:మహిళగా పుట్టినందుకు సిగ్గుపడేలా చేశాడు.. మాజీ బాయ్ ఫ్రెండ్ పై అనుపమ షాకింగ్..!

Anupama : ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బాయ్ఫ్రెండ్ చూపించిన నరకం గురించి మరోసారి బయటపెట్టింది.

on
- Advertisement -banner Ad

Anupama :టాలీవుడ్ కోలీవుడ్ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక విషయంలో ఈమె పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ గా మారుతున్నాయి. తన జీవితంలోని అత్యంత చేదు అనుభవాలను ఇటీవల కాలంలో బయటపెడుతూ వస్తోంది అనుపమ. గతంలో తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని అతని వల్ల తీవ్రమైన మానసిక క్షోభను కూడా అనుభవించాను అంటూ తెలియజేసింది.

మహిళగా పుట్టినందుకు సిగ్గుగా ఉంది..

ఇప్పుడు మరొకసారి ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ మాట్లాడుతూ.. తాను మహిళగా నటిగా సమాజంలో ఎంతో ధైర్యంగా నిలబడాలని ప్రయత్నించిన తనకు తన మాజీ ప్రియుడు ప్రవర్తన వల్ల తన పైన తనకే సిగ్గుగా అనిపించింది అంటూ తెలిపారు. ప్రతి నెల ఒక స్త్రీగా సహజంగా జరిగే పీరియడ్స్ ప్రక్రియను కూడా అతను చాలా చులకనగా చూసేవారని, తాను ఏ రోజైనా అతని తప్పులను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే.. వెంటనే నీకు పీరియడ్స్ సమయమా లేక ఇంకా రాలేదా అంటూ ప్రశ్నించే వారని.. ఇదంతా కేవలం మూడ్ స్వింగ్స్ వల్ల మాత్రమే అని చాలా తేలికగా కొట్టి పారేశారు అంటూ అనుపమ(Anupama) తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read:Toxic:యష్ ‘టాక్సిక్’పై భారీ హైప్.. టికెట్ల బుకింగ్స్ ఎప్పటినుంచంటే?

ఎన్నోసార్లు తన మీద తనకే అసహ్యం వేసిందట..

ప్రతిసారి అలాంటి రకమైన వ్యాఖ్యలు విన్నప్పుడు తాను ఒక మహిళగా పుట్టినందుకే ఇలా మాటలు అనిపించుకోవలసి వస్తోందని తన ఉనికిపైన తనకే చాలాసార్లు అసహ్యం వేసిందంటూ అనుపమ తెలిపారు . ఈ విషపూరితమైన రిలేషన్షిప్ వల్ల తన జీవిత లక్ష్యాలు ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోయాయి అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. చిన్నప్పటి నుంచి తనకు 11 మంది పిల్లలు ఉండాలని చాలా ఆశగా కలలు కనేదాన్ని. ఆ వ్యక్తితో గడిపిన రెండు సంవత్సరాల కాలంలో భవిష్యత్తులో ఇకమీదట పిల్లలే వద్దు అనేలా తీవ్రమైన నిర్ణయానికి వచ్చేలా ఆలోచనలను దిగదార్చేలా చేశారని తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Amitabh Bachchan:బిగ్ బి కష్టాలు వింటే షాక్ అవ్వాల్సిందే.. ఆ ఒక్క కారణంతో అవకాశాలు మిస్!

డిప్రెషన్ లోకి వెళ్లిపోయా..

అతని ప్రవర్తన వల్ల తాను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని అనుపమ తెలిపింది. ఆ చేదు జ్ఞాపకాల నుంచి తాను బయటపడడానికి చాలా సమయం పట్టిందని తెలిపింది. ప్రస్తుతం అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఎవరంటే కచ్చితంగా ప్రతి ఒక్కరు ధృవ్ విక్రమ్ పేరే చెబుతున్నారు. ఇటీవలే ధ్రువ్ విక్రమ్ కూడా తన మీద జరుగుతున్న ట్రోల్స్ పైన స్పందించారు. తాను చిన్న వయసు నుంచి ఎన్నో అనుభవాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని ఇలాంటివి తనని ఏవి ప్రలోభాలకు గురి చేయవంటూ తెలియజేశారు. కానీ ఇప్పుడు అనుపమ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you