Wednesday, August 19, 2026
HomeLATESTToxic:యష్ ‘టాక్సిక్’పై భారీ హైప్.. టికెట్ల బుకింగ్స్ ఎప్పటినుంచంటే?

Toxic:యష్ ‘టాక్సిక్’పై భారీ హైప్.. టికెట్ల బుకింగ్స్ ఎప్పటినుంచంటే?

Toxic:కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా టికెట్ల బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

Toxic:యష్.. యష్.. యష్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా నయనతార లాంటి ఓ స్టార్ హీరోయిన్ నోటి నుంచి యష్ పేరు రావడం, ఆయన పిలిచాడని సినిమా ప్రమోషన్స్‌కి వచ్చాను అని చెప్పడం సినిమా ఇండస్ట్రీలోనే సెన్సేషన్ గా మారింది.

పాన్ ఇండియా సెన్సేషన్‌గా యాష్:

‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా సెన్సేషన్‌గా మారిన కన్నడ సూపర్ స్టార్ హీరో యష్ మరోసారి ‘టాక్సిక్’(Toxic)తో భారీ సక్సెస్ అందుకోవడానికి బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యాడు. ఈ డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా ఒక లేడీ డైరెక్టర్ ఈ సినిమాని ఇంత వైలెంట్‌గా తెరకెక్కించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

- Advertisement -
Advertisement

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, క్రేజీ పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వైలెన్స్‌కి అమ్మ మొగుడు లాంటి రేంజ్ వైలెన్స్ ఉండబోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కీలక అప్‌డేట్ కూడా వచ్చేసింది.

ఆగస్టు 26న ‘టాక్సిక్’ రిలీజ్:

గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘టాక్సిక్’ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా బహుభాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌ని చక్కగా కంప్లీట్ చేసుకున్న చిత్ర బృందం ఇంకా కూడా చిత్ర ప్రమోషన్స్‌ని చురుగ్గా చేస్తుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే ట్రైలర్ నుంచి విడుదలైన కొన్ని సన్నివేశాలు, విజువల్స్, స్టైల్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Amitabh Bachchan:బిగ్ బి కష్టాలు వింటే షాక్ అవ్వాల్సిందే.. ఆ ఒక్క కారణంతో అవకాశాలు మిస్!

యాక్షన్, రొమాన్స్‌కు పెద్దపీట:

ఈ సినిమాలో వైలెన్స్, రొమాన్స్ అంతకుమించిన రేంజ్‌లో ఉంటాయి అంటూ రిలీజ్ అయిన అప్‌డేట్స్ ఆధారంగా తెలిసిపోతుంది. యాక్షన్ డిజైన్, సినిమాటిక్ స్కేల్ విషయంలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా గీతు మోహన్‌దాస్ తెరకెక్కించిన డార్క్ విజువల్ వరల్డ్ సినిమాకు విభిన్నమైన గుర్తింపును తీసుకొస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అంటూ జనాలు వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Anurag kashyap: 25 ఏళ్ల చిన్నదానితో డైరెక్టర్ రిలేషన్ షిప్..!

ఆగస్టు 21 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్:

‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ 2026 ఆగస్టు 21 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో జనాలు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు యాష్‌ని వైలెంట్ లుక్స్‌లో చూడబోతున్నామా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే ‘టాక్సిక్’ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ మొత్తం బ్లాస్ట్ చేసేస్తుంది అన్న రేంజ్‌లోనే కనిపిస్తుంది. చూడాలి మరి సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకుంటుంది, ఎలాంటి కలెక్షన్స్ దక్కించుకుంటుంది అనేది..??

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you