Tuesday, August 18, 2026
HomeLATESTAnurag kashyap: 25 ఏళ్ల చిన్నదానితో డైరెక్టర్ రిలేషన్ షిప్..!

Anurag kashyap: 25 ఏళ్ల చిన్నదానితో డైరెక్టర్ రిలేషన్ షిప్..!

Anurag kashyap: వయసులో తనకంటే చాలా చిన్న అమ్మాయితో రిలేషన్ పై అనురాగ్యసభ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

on
- Advertisement -banner Ad

Anurag kashyap: సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో కూడా ఒక విభాగంలో సత్తా చాటడమే కష్టం అనుకుంటే పలు విభాగాలలో కూడా తనదైన మార్కుతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్. డైరెక్టర్ గా బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన అనురాగ్ కశ్యప్, నటుడుగా కూడా అద్భుతమైన పాత్రలలో నటించారు. దీంతో సౌత్ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.

23 ఏళ్ల చిన్నమ్మాయితో రిలేషన్..

అనురాగ్ కశ్యప్ (Anurag kashyap)తన వ్యక్తిగత జీవిత విషయం పైన తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన వయసు 53 సంవత్సరాలు.. తనకంటే 23 సంవత్సరాలు చిన్నదైన శుభ్రా శెట్టి (30 ఏళ్ళు) తో గత కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తమ మధ్య ఉన్న ఈ వయసు వ్యత్యాసం, పెళ్లి ఆలోచనల పైన మొహమాటం లేకుండా మాట్లాడారు డైరెక్టర్. శుభ్రా శెట్టి తో రిలేషన్ షిప్ ప్రారంభంలో ఎదురైన మానసిక సంఘర్షణ గురించి కూడా తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Anirudh – Kavya:అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి డేట్ ఇదేనా..?

వయసు తేడాపై స్పందించిన డైరెక్టర్..

మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా తనని ఆందోళనకు చాలా సార్లు గురి చేసిందని.. రోజురోజుకి నా వయసు పైబడుతూ ఉంటే ఆమె ముఖంలో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించలేదు, ఇప్పటికీ చిన్న పిల్లలాగే ఉంది ఈ వ్యత్యాసం చూసి నేను చాలా సార్లు అభద్రత భావానికి కూడా లోనయ్యాను, ఒకానొక సమయంలో ఆమెతో బంధాన్ని తెంచుకొని దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను, కానీ ఆమెతో సమయం గడుపుతున్నప్పుడు ఆ వయసు వ్యత్యాసం ఎప్పుడూ కూడా గుర్తుకు రాలేదని , ప్రస్తుతం ఇద్దరం చాలా సంతోషంగా జీవిస్తున్నామని తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Jana Nayagan:విజయ్ చివరి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ మధురమైన జ్ఞాపకానికి పెళ్లి అనే బంధం వద్దు..

ఆ మధురమైన అనుబంధాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా వదులుకోమని తెలిపారు. శుభ్రా శెట్టి సాంప్రదాయ వివాహ వ్యవస్థ పైన నమ్మకం లేదని.. బంధానికి వివాహమనే ముద్ర వేయడం కంటే ఇద్దరి మధ్య కూడా నిజమైన ప్రేమ పరస్పర ఆనందం ఉండడమే చాలా ముఖ్యమని తన అభిప్రాయంగా తెలిపారు. అనురాగ్ కశ్యప్ నయనతార నటించిన అంజలి సిబిఐ చిత్రంలోనే కాకుండా విజయ్ నటించిన లియో చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటించారు. అలాగే విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రంలో కూడా అద్భుతమైన విలనిజంతో ఆకట్టుకున్నారు. తెలుగులో వచ్చిన డెకాయిట్ చిత్రంలో కనిపించారు. రాబోయే రోజులలో సౌత్ సినిమాల పైన తన ఫోకస్ ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు అనురాగ్ కశ్యప్. ఏది ఏమైనప్పటికీ శుభ్రా శెట్టి తో తనకున్న బంధం పైన వయసు తేడా పైన స్పందించడంతో పలువురు నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you