Friday, August 21, 2026
HomeLATESTspirit movie :స్పిరిట్ మూవీ నుంచి అందుకే ప్రకాష్ రాజ్ తప్పుకున్నారా..?

spirit movie :స్పిరిట్ మూవీ నుంచి అందుకే ప్రకాష్ రాజ్ తప్పుకున్నారా..?

Spirit movie: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీ నుండి ప్రకాష్ రాజ్ తప్పుకోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

spirit movie :టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం స్పిరిట్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రాబోతోందని తెలిసి అభిమానులకు అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్లకే భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా నుంచి ట్రైలర్ టీజర్ విడుదల అయ్యిందంటే చాలు మరింత అంచనాలు పెంచేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ఆయా సినిమా షూటింగ్లలో కూడా బిజీగా ఉన్నారు.

స్పిరిట్ మూవీ నుండి తప్పకుండా ప్రకాష్ రాజ్..

అయితే వీటన్నిటిలో ప్రభాస్ స్పిరిట్ సినిమా డిసెంబర్ మూడవ తేదీన విడుదల కాబోతోంది. పీరియాడిక్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్గా త్రిప్తి డిమ్రి నటిస్తోంది. స్పిరిట్(spirit movie )సినిమా నుంచి ఒక స్టార్ నటుడు తప్పుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్. స్పిరిట్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారని కానీ ప్రకాష్ రాజ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఒక సీన్ విషయంలో ఇద్దరి మధ్య డిఫరెన్స్ రావడంతో ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:YouTuber :రూ.23 లక్షలు నష్టపోయిన నటుడు అంజిమామ..!

ఈ విషయంపై స్పందించిన ప్రణయ్ రెడ్డి..

అయితే ఈ విషయం పైన ఎక్కడా కూడా అధికారికంగా అప్డేట్ కూడా రాలేదు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో లేరని క్లారిటీ ఇవ్వడం జరిగింది.. అటు ప్రకాష్ రాజ్, సందీప్ రెడ్డి ఇద్దరు కూడా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులు . దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి ఇష్యూ వచ్చిందని తెలిపారు. దీన్నిబట్టి చూస్తూ ఉంటే ఈ కారణం చేత ప్రకాష్ రాజ్ స్పిరిట్ సినిమా నుంచి తప్పుకున్నట్లు క్లారిటీ వస్తోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఇప్పుడు స్పిరిట్ సినిమా పైన మరింత హైప్ పెరుగుతోంది.

- Advertisement -
Advertisement

also read:Sowcar Janaki:నటి షావుకారు జానకి కన్నుమూత..!

ప్రభాస్ సినిమాలు..

ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ఏడాది ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.. ప్రస్తుతం ఫౌజీ, కల్కి 2, సలార్ 2 తదితర చిత్రాలలో నటించనున్నారు. ఇప్పటికే ఇందులో కొన్ని సినిమా షూటింగులన్నీ కూడా మొదలయ్యాయి. మరికొన్ని ప్రభాస్ డేట్ ల కోసం డైరెక్టర్లు సైతం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ అభిమానులు మాత్రం సినిమాలు కోసమే కాకుండా ప్రభాస్ పెళ్లి విషయంపై ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. అయితే ఈ విషయం పైన ప్రభాస్ ఇంకా ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. మరి ఈ విషయంపై ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you