Hema:సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో యాంకర్ కమ్ నటి అనసూయకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. కొంతమంది అనసూయను ఇష్టపడుతూ ఉంటారు. మరికొంతమంది ఆమెకు ఘాటుగా కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. నటి అనసూయ ఏం మాట్లాడినా సరే సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతం చేసే బ్యాచ్ ఒకటి ఎప్పటికీ ఉంటుంది అంటూ ఆమె ఫ్యాన్స్ మాట్లాడుతూనే ఉంటారు.
ఊహించని వివాదంలో అనసూయ:
రీసెంట్‌గా అనసూయ ఊహించని చిక్కుల్లో ఇరుక్కుంది. దేవుడి ఫోటోలు పెట్టుకొని జై శ్రీరామ్ అంటూ, జై హింద్, వందేమాతరం అనే పదాలను ప్రస్తావిస్తూ వీడియో విడుదల చేసింది. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు ఘాటుగా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతానికి దారితీసింది.ఆ తర్వాత అనసూయ దీనిపై క్లారిటీ ఇస్తూ ఇంకో వీడియో కూడా విడుదల చేసింది. అయితే వివాదం మరింత రాజుకుంది.
అనసూయపై హేమ ఘాటు వ్యాఖ్యలు:
తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ సీనియర్ నటి హేమ (Hema)ఘాటుగా స్పందించారు. నటి అనసూయ వ్యాఖ్యలపై కౌంటర్ వేశారు. ఈ సందర్భంగా హేమ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హేమ మాట్లాడుతూ.. “మనం అద్దాల మేడలో బతుకుతున్నాం. మనం చేసే ప్రతి పనిని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. నీ పర్సనల్, నీ జీవితం నీ ఇష్టం. కానీ కోట్లాది మంది విశ్వసించే విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్థం ఉండాలి. చేసే పనులకు గౌరవం ఉండాలి. మనం మాట్లాడే మాటలకు, చేసే పనులకు సంబంధం లేకపోతే ప్రజలు ఈజీగా పసిగట్టేస్తారు.
also read:Tollywood:చిరంజీవి క్యారెక్టర్ పై బండ్ల గణేష్ అలా.. హైపర్ ఆది ఇలా..!
‘జై శ్రీరామ్’పై హేమ స్పందన:
జై శ్రీరామ్ అనేది ఒక స్లోగన్ అని అనుకుంటే తప్పు. కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన మంత్రం అది. ఎంతో పవిత్రమైన మంత్రం. చాలామంది బాగా నమ్మే మంత్రం. జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అనేది ఒక పవర్. నువ్వు ఎవరినైనా అనాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా, సూటిగా ఆ వ్యక్తి పేరు చెప్పి అనాలి. అంతేకానీ నువ్వు దేవుళ్ల ఫోటోలు పెట్టుకొని జై శ్రీరామ్ అంటూ మరికొన్ని పదాలు అంటూ ఉంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. అవి నాకు అసలు నచ్చలేదు. నువ్వు అలా అనడం సరి కానే కాదు.
also read:Chiranjeevi:చిరంజీవి బర్త్డే స్పెషల్ టీవీ మూవీస్..!
‘దమ్ము ధైర్యం ఉంటే పేరు చెప్పు’:
ఆ తర్వాత నువ్వు అందరినీ అనలేదని అన్నావు. చూసావా.. నువ్వు అందరినీ అనకపోతే ఎవరిని ఉద్దేశించి అన్నావు? అతని పేరు బయటపెట్టు. దమ్ము ధైర్యం ఉంటే వారి పేరు పెట్టి నేరుగా అనాలి. అది నిజాయితీ అంటే. అంతేకానీ హిందువుల మనోభావాలను దెబ్బతీయకు. కర్మ రిటర్న్స్‌ను నేను కచ్చితంగా నమ్ముతాను. ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఫ్యూచర్‌లో కచ్చితంగా అనుభవిస్తావు” అంటూ హేమ వ్యాఖ్యానించింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు హేమ మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అనసూయ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్‌కు గురవుతున్నారు.
తెలుగు ఐటెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనసూయ భరద్వాజ్ కు హాస్య నటి హేమ హెచ్చరిక.
మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడొద్దు అంటూ హెచ్చరిక. pic.twitter.com/k1BW8SJB57
— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) August 21, 2026




