Monday, August 24, 2026
HomeLATESTJabardasth Pavitra:ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్..

Jabardasth Pavitra:ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్..

Jabardasth Pavitra: జబర్దస్త్ లేడీ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఒక ఎమోషనల్ వీడియో పంచుకుంది.

on
- Advertisement -banner Ad

Jabardasth Pavitra:జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించిన లేడీ కమెడియన్లలో జబర్దస్త్ పవిత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. టిక్ టాక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించిన ఈమె .. బుల్లితెర ఆడియన్స్ ని జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాపులారిటీ సంపాదించుకుంది పవిత్ర. అలాగే పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించేది . అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి లేడీ కమెడియన్ గా పేరు సంపాదించింది. ఇదంతా ఇలా ఉంటే ఈమధ్య తన ప్రియుడుతో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను కూడా షేర్ చేసింది.

ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం పై పవిత్ర కామెంట్..

త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రకటించడంతో అభిమానులు పలువురు నెటిజన్స్ కూడా ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఇప్పుడు తాజాగా బ్రేకప్ చెప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ బ్రేకప్ స్టోరీ గురించి తెలియజేసింది. ఇది నా ఫాస్ట్ లవ్ స్టోరీ దీని గురించి ఇంతకుముందు ఎప్పుడు బహిరంగంగా మాట్లాడలేదు. నేను ఆ వ్యక్తిని చాలా ప్రాణంగా ప్రేమించాను. ఆ బంధానికి సర్వస్వం అప్పగించాను, కానీ నెమ్మదిగా ఆ బంధమే నాకు ఊపిరాడకుండా చేసి చాలా గొడవలు అవమానాలు వేధింపులకి గురిచేసింది.

- Advertisement -
Advertisement

also read:Tollywood anchor:బిగ్ బాస్ 10 లోకి అందాల యాంకరమ్మ..టీవీలకు అతుక్కుపోతారు జనాలు..!

అదే నేను చేసిన తప్పు..

ప్రతిదీ నా తప్పే అని నమ్మడం మొదలు పెట్టాను. అది వేధింపులకు కారణం అయిందని, ఆ విషయం నేను గ్రహించలేకపోయాను.. అయితే అతన్ని గాఢంగా ప్రేమించినందుకు ఎప్పటికైనా పరిస్థితులు మారుతాయి అని చాలా రోజులపాటు ఆశతో ఎదురు చూశాను. కానీ ఆ ఆశలన్నీ నిరాశగా మారాయి.. నేను చివరిగా ఆ బంధం నుంచి బయటపడ్డాను.. ఈ పోస్ట్ పంచుకుంటూ ఒక పోస్టుని షేర్ చేసింది నటి పవిత్ర(Jabardasth Pavitra). అయితే ఇది సానుభూతి కోసం చెప్పుకోవడం లేదు. వేరొకరు మా పరిస్థితిని గుర్తించాలనే ఉద్దేశంతోనే పంచుకుంటున్నాను అంటూ తెలిపింది పవిత్ర.

- Advertisement -
Advertisement

also read:HDB chiranjeevi: కాకా టైటిల్ తో అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్!

ఆత్మగౌరవాన్ని నాశనం చేసుకోవద్దు..

ఎవరైనా మిమ్మల్ని నిరంతరం బాధిస్తూ లేదా పనికిరాని వారిగా భావిస్తే మాత్రం వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రేమ మీ మనశ్శాంతిని, ఆత్మగౌరవాన్ని ఎప్పుడు నాశనం చేయకూడదని తెలిపింది పవిత్ర.. ప్రస్తుతం జబర్దస్త్ నటి షేర్ చేసిన ఈ పోస్ట్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జబర్దస్త్ పవిత్ర కి అండగా పలువురు నెటిజన్స్ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఎంగేజ్మెంట్ తర్వాత వివాహాన్ని క్యాన్సల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వారి లిస్టులోకి జబర్దస్త్ పవిత్ర కూడా చేరింది.

- Advertisement -
Advertisement

https://www.instagram.com/reel/DcGXFShhQIO/?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you