OTT Movie: థియేటర్లలో ఎన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయినా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా, కచ్చితంగా వీకెండ్ వచ్చింది అంటే మాత్రం ఓటీటీలో ఒక్క హారర్ సినిమా అయినా చూడాల్సిందే. తెలుగు భాషలో లేకపోయినా సరే, వేరే భాషలో సెర్చ్ చేసి మరీ మంచి హారర్ మూవీ ఏది ఉంది అని చూసుకుని జనాలు, మనలో చాలామంది ఉంటారు. ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటి కంటెంట్ సినిమాలు ఏ భాషలో తెరకెక్కించినా బాగా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటారు. ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు..అలాంటి హారర్ సినిమాలు బోలెడు ఉన్నాయి. భయం పుట్టించే సీన్స్ ఉన్నా కూడా చేతులతో కళ్ళు మూసుకుని కొంచెం కొంచెం వేలు జరుపుతూ వేళ్ల సందుల మధ్యలో నుంచి సినిమా చూసే జనాలు బోలెడు మంది ఉన్నారు. అందులో నో డూట్.
మరో భయానక హారర్ థ్రిల్లర్ మూవీ:
అలాంటి వారి కోసమే మరొక ఒళ్లు గగుర్పొడిచే భయానక హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. హాలీవుడ్‌లో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ మూవీ “బరీ: ది డెవిల్” (Burry the Devi)ఇప్పుడు ఓటీటిని షేక్ చేస్తుంది. చూసిన ప్రతి ఒక్కరూ గజగజ వణికిపోతూ కామెంట్స్ చేస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్:
ఆడమ్ ఓబ్రియం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సడన్‌గా ఈ చిత్రం ఓటీటీలోకి (OTT Movie)వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్‌తో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రావడంతో ఈ సినిమాను జనాలు ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు.
ALSO READ:Bigg Boss :బిగ్ బాస్ తెలుగు 10 అగ్నిపరీక్షలో అదరగొడుతున్న కామన్ గర్ల్!
ఒళ్లు గగుర్పొడిచే సీన్స్:
దెయ్యాలు, సస్పెన్స్ సినిమాలు ఇష్టం ఉన్నవాళ్లకి ఈ సినిమా కచ్చితంగా పిచ్చెక్కించేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కథ చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా కథ మొత్తం నర్స్ జూలియా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అయితే ఒక్కొక్క సీన్‌లో ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది. ఒళ్లు జల్లుమనే సీన్స్, “అమ్మో.. నేను చూడలేను రా బాబోయ్” అనిపించే విధంగా ఉండే షాట్స్ ఎన్నెన్నో ఉన్నాయి.
ALSO READ:OTT:8 వారాల ఓటీటీ రూల్.. చిన్న నిర్మాతలకు కొత్త టెన్షన్!
హారర్ మూవీ లవర్స్‌కు తప్పక చూడాల్సిన సినిమా:
ఒక పాత ఇంట్లో జరిగే ఈ కథ ఆడియన్స్‌కు సర్‌ప్రైజింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఇస్తుంది. హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్లు కచ్చితంగా మస్ట్‌గా చూడాల్సిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. హారర్ సినిమాలు ఇష్టం ఉన్నవాళ్లు కచ్చితంగా ఈ మూవీ చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం? హారర్ సినిమాలు అంటే ఇష్టం ఉన్నవాళ్లు “బరీ: ది డెవిల్” సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.
#BuryTheDevil (English)
Now streaming on PrimeVideo in English, Tamil, Telugu, Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/ZrFm0qm6CW
— OTT Trackers (@OTT_Trackers) August 22, 2026




