Allu Arjun:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 చిత్రాలతో భారీ విజయాన్ని అందుకొని దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించారు. దీంతో ఇతర దేశాలలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెరిగారు. తాజాగా అల్లు అర్జున్ కి మరో అరుదైన ఘనత అందుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే forbes india 2026 లో ప్రకటించగా.. 100 బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ ప్రత్యేక సంచిక కవర్ పైన అల్లు అర్జున్ స్థానం దక్కించుకున్నారు. సినిమాలతో పాటు అల్లు అర్జున్ కూడా బ్రాండ్ ఇమేజ్, బాక్సాఫీస్ ప్రభావం వల్ల అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా పాపులారిటీ పెరుగుతోంది. అందుకు నిదర్శనం ఇదే అని కూడా చెప్పవచ్చు.
అరుదైన గౌరవాన్ని అందుకున్న బన్నీ..
పుష్ప 2 సినిమా సాధించిన విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. పలు భాషలలో ప్రాంతాలతో సంబంధం లేకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అల్లు అర్జున్ ప్రభావం ఇప్పుడు సినిమాలకే పరిమితం కావడం లేదు. ఆయన స్టైల్, డాన్స్ మేనరిజం సినిమాలలోని పాత్రలు కూడా ప్రేక్షకుల పైన చాలా ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ప్రముఖ బ్రాండ్ సైతం అల్లు అర్జున్ ని తమ ప్రచారంలో భాగం చేసుకోవాలని మరింత ఆసక్తి చూపిస్తున్నాయి. అలా ఫోర్బ్స్ ఇండియా కథనం అల్లు అర్జున్ గురించి పేర్కొంది.
also read:Ranabali:విజయ్ దేవరకొండ రణబాలి మూవీ వాయిదా..?
మారుతున్న ప్రయారిటీ..
ప్రేక్షకులతో బలమైన కనెక్షన్, వారి అభిమానం, కమర్షియల్ ఇమేజ్ ఇవన్నీ కలిపి ఆయనను అత్యంత ప్రభావితమైన సెలబ్రిటీ జాబితాలో నిలబెట్టాయంటూ తెలిపారు. అల్లు అర్జున్ ఫోర్బ్స్ ఇండియా కవర్ పైన ఆయన కనిపించడం, భారతీయ సినీ తారల మారుతున్న తీరుకు సైతం ప్రత్యేకించి ఈ గుర్తింపు లభిస్తోందని ట్రేడ్ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ తో స్టార్డమ్ ని అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు కల్చరల్ ఇంపాక్ట్, బ్రాండ్ పవర్ ,ఆడియన్స్ ప్రయారిటి వంటి విలువలు కూడా కీలకంగా మారాయి.
also read:TOXIC :యష్ ‘టాక్సిక్’ ఫ్లాప్.. దిల్ రాజు తెలివికి ఫిదా అవుతున్న నెటిజన్లు!
అల్లు అర్జున్ సినిమాలు..
పుష్ప, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో చేరిన అల్లు అర్జున్(Allu Arjun) ఇప్పుడు జాతీయ సెలబ్రిటీగా, బ్రాండ్ కు అంబాసిడర్ గా మరింత పేరు సంపాదించుకున్నారు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాల్ని భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్కి మొదటిసారి హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ గతంలో ఎప్పుడు చూడని విధంగా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాకా సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ పోస్టర్లను, దీపిక పదుకొనే పోస్టర్లను విడుదల చేయగా సినిమా పైన అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.
🤍@ForbesIndia #CoverStory #Showstoppers2026 pic.twitter.com/XxLExdn1Cz
— Allu Arjun (@alluarjun) August 27, 2026




