Tellakagitham:కొన్ని కొన్ని సినిమాలు హిట్ అవుతాయా..? లేదా..? అని చిన్న టీజర్, ట్రైలర్ చూస్తే చాలు ఇట్టే చెప్పేయొచ్చు. పెద్ద పెద్ద బడా ప్రాజెక్ట్స్ వేల కోట్ల ఖర్చు పెట్టి తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అవుతూ ఉంటాయి. కానీ చిన్న చిన్న సినిమాలు, చిన్న కాన్సెప్ట్‌తో, చిన్న నటీనటులతో తెరకెక్కించిన మూవీస్ సింపుల్ కాన్సెప్ట్‌తోనే భారీ విజయాన్ని అందుకుంటూ ఉంటాయి. అలాంటి లిస్టులోకి చాలా సినిమాలే వస్తాయి. తాజాగా ఆ లిస్టులోకి యాడ్ అయ్యే సినిమా ‘తెల్ల కాగితం’ అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు జనాలు.
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా ‘తెల్ల కాగితం’ :
యంగ్ హీరో హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న లేటెస్ట్ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘తెల్ల కాగితం’(Tellakagitham). ఈ సినిమా పై జనాలు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా హర్ష్ రోషన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించే సినిమాలు బాగా యూత్‌ను ఆకట్టుకుంటాయి అన్న అభిప్రాయం కూడా ఉంది. దీపక్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ‘తెల్ల కాగితం’ సినిమా టీజర్ రిలీజ్ అయింది. అభిమానులను ఈ టీజర్ బాగా ఆకట్టుకుంటుంది.
క్యూరియాసిటీ పెంచుతున్న టీజర్ :
రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నందు సవరిగాన కథ, అదేవిధంగా స్క్రీన్‌ప్లే, అంతేకాకుండా సంభాషణలు అందించారు. తాజాగా చిత్ర బృందం టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ అద్భుతంగా, అత్యంత ఆసక్తికరంగా అభిమానులను ఆకట్టుకుంటుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అనే విధంగా క్యూరియాసిటీ పెంచేసింది.
అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్ములపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడం గమనార్హం. ఈ సినిమా టీజర్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు.
ALSO READ:OTT Weekend Releases: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఇవే!
నేటి యువతకు సరిపోయే కథ :
టీజర్ విషయానికి వస్తే.. ‘తెల్ల కాగితం’ నేటి యువతకు బాగా సరిపడే విధంగా తెరకెక్కించారు. యువతలో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్లు చేసే తప్పులేంటి, వాళ్ల ఎమోషన్స్ ఏంటి, వాళ్లలో ఉండే నిర్మలమైన భావాలు ఎలా ఉంటాయి, వాళ్లపై వచ్చే నిందలు ఏంటి, వాళ్లు తీసుకునే డెసిషన్స్ ఏంటి అనే హావభావాలను చక్కగా చూపించారు.
ప్రతి ఒక్కరి జీవితం తెల్ల కాగితంలా ఉండదు. ఉండకుండా చేసే జనాలు కూడా వాళ్ల చుట్టూ ఉంటారు. అలా బతకనివ్వరు. అలాంటప్పుడు మంచిగా ఉండకూడదా అనే కాన్సెప్ట్‌ను అభిమానులకు బాగా ఇంట్రెస్టింగ్గా ఎలివేట్ చేసే విధంగా చూపించారు.
ALSO READ:Siva Nirvana:వైష్ణవి నడుము సీన్ పై డైరెక్టర్ శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్..!
‘తెల్ల కాగితం’పై ఎర్ర మచ్చ పడకూడదనే కాన్సెప్ట్ :
తెల్ల కాగితంపై ఎర్ర మచ్చ పడకూడదనేది ఈ సినిమా టోటల్ కథ అని టీజర్‌తో అర్థమైపోయింది. ఈ సినిమా ఖచ్చితంగా యూత్‌కు ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా నడుస్తుంది అని చెప్పడంలో నో డౌట్ అంటున్నారు సినీ ప్రముఖులు. దిల్ రాజు ఈ సినిమా టీజర్ చూసి ప్రశంసల వర్షం కురిపించారు. యంగ్ జనరేషన్ పిల్లలు ఈ టీజర్ చూసి బాగా కనెక్ట్ అవుతున్నారు. మరెందుకు ఆలస్యం.. యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్న ఈ ‘తెల్ల కాగితం’ టీజర్‌ను మీరు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.




