Sunday, September 6, 2026
HomeMOVIE NEWSTollywood: డిసెంబర్ సీజన్‌పై స్టార్ హీరోల ఫోకస్.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలేనా?

Tollywood: డిసెంబర్ సీజన్‌పై స్టార్ హీరోల ఫోకస్.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలేనా?

Tollywood: డిసెంబర్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాల మధ్య భారీ పోటీ కనిపించనుంది.

on
- Advertisement -banner Ad

Tollywood:ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ చేయాలి అంటే ఎప్పుడు సంక్రాంతి వస్తుందా? ఇప్పుడు దసరా వస్తుందా? ఇప్పుడు దీపావళి వస్తుందా? అని ఎదురు చూసేవాళ్లు. ఆ సీజన్స్‌కు ఉండే క్రేజ్ అలాంటిది. కానీ ఇప్పుడు టోటల్ సీన్ మారిపోయింది. సంక్రాంతి, దసరా, దీపావళి కన్నా కూడా ఎక్కువగా అందరి కళ్లు డిసెంబర్ పైనే పడుతున్నాయి. ఈ డిసెంబర్ సీజన్‌కు ఉన్న భారీ డిమాండ్ ఇప్పుడు జనాల్లో పెద్ద క్యూరియాసిటీని కూడా పెంచేసింది.

డిసెంబర్‌లో రిలీజ్ అయితే హిట్‌ ఖాయమనే నమ్మకం..:

ఎటువంటి సినిమాలైనా సరే డిసెంబర్ నెలలో రిలీజ్ అయితే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్ అవడం ఖాయం అని మేకర్స్ భావిస్తున్నారు. గతంలో ఎన్నో సినిమాలు ఇదే విధంగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందుకే బాలీవుడ్, టాలీవుడ్(Tollywood) హీరోలు అందరూ కూడా తమ సినిమాలను డిసెంబర్ సీజన్‌కు షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ హాలిడేస్‌ను టార్గెట్ చేస్తూ డిసెంబర్ సీజన్‌లో సినిమా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Tollywood: డిసెంబర్ సీజన్‌పై స్టార్ హీరోల ఫోకస్.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలేనా?

గత మూడు సంవత్సరాలుగా ఇదే సెంటిమెంట్..:

గత మూడు సంవత్సరాల నుంచి ఈ సీజన్ బాగా కలిసి రావడంతో ఈ సెంటిమెంట్ మరింత బలంగా నాటుకుపోయేలా చేస్తుంది. ఈ డిసెంబర్‌పై అఫీషియల్ కర్చీఫ్ వేశారు కొంతమంది టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్.

- Advertisement -
Advertisement

also read:Mirzapur Movie Review: ‘మీర్జాపూర్’ సినిమా రివ్యూ..ఓటీటీ మ్యాజిక్ వెండితెరపై పనిచేసిందా?

ప్రభాస్ నుంచి భారీ అంచనాలతో సినిమా..:

ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్. నెవర్ బిఫోర్‌ ఎవర్ ఆఫ్టర్ గా డార్లింగ్‌ను చూపించబోతున్నారు డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ సినిమా డిసెంబర్ 3న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుందని జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

షారుక్, నాగార్జున కూడా లైన్లో..:

ఇక క్రిస్మస్‌ను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా లైన్లో ఉన్నాడు. అదే విధంగా టాలీవుడ్ కింగ్ హీరో నాగార్జున తన మైల్‌స్టోన్ మూవీ 100తో మంత్ ఎండింగ్‌ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్‌ కూడా..:

బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్‌లు కూడా డిసెంబర్ నెలను టార్గెట్ చేస్తున్నారన్న టాక్ వచ్చింది. నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న NBK 111ను క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడంటూ సమాచారం.

డిసెంబర్‌లో మరిన్ని సినిమాలు..

ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా డిసెంబర్ సీజన్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే సంక్రాంతి కంటే ముందే డిసెంబర్‌లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించేలా ఉంది. ఏ సినిమా ఎంత పర్ఫెక్ట్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తుందో, ఏ హీరోలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో, ముందున్న స్టార్ హీరోల రికార్డ్స్ ఎలా బ్రేక్ చేస్తారో తెలియాలి అంటే డిసెంబర్ 30 వరకు ఆగాల్సిందే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you