Sunday, September 6, 2026
HomeLATESTTollywood:టైటిల్‌తోనే సంచలనం.. భారతీయ సినిమాలో కొత్త రికార్డు సృష్టించిన సినిమా!

Tollywood:టైటిల్‌తోనే సంచలనం.. భారతీయ సినిమాలో కొత్త రికార్డు సృష్టించిన సినిమా!

Tollywood:సినిమా టైటిల్‌ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగలదని నిరూపిస్తూ ఓ భారతీయ సినిమా కొత్త రికార్డు సృష్టించింది.

on
- Advertisement -banner Ad

Tollywood:సాధారణంగా సినిమా టైటిల్స్ చాలా చిన్నగా, క్యాచీగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్.. చిన్న టైటిల్ అయితే జనాల్లోకి త్వరగా వెళ్తుందని, రెగ్యులర్‌గా వాడే పదాలు కాకుండా క్యాచీ పదాలు అయితే జనాల అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందని నమ్మకం మేకర్స్ అందరిలోనూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం చాలా చాలా డిఫరెంట్. ఇండియన్ సినిమా(Tollywood) హిస్టరీలో ఇప్పటివరకు ఎవరూ విని ఎరుగని రేంజ్‌లో అత్యంత పొడవైన టైటిల్‌తో ఓ సినిమా వస్తుంది. దాని గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

సినిమా టైటిల్ ఏంటంటే :

ఆ సినిమా టైటిల్ ఏంటో కాదు.. ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’(Ee Pata Korinavaru Nemalipalem Nundi Rama, Jyotsna, Nandu, Murali, Kabir, Dhol Ravi Modalaguvaru) అనే హై కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంతో స్టార్ దర్శకుడు చంద్ర సిద్ధార్థ మరోసారి మన ముందుకు రాబోతున్నారు.

- Advertisement -
Advertisement

చంద్ర సిద్ధార్థకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని అందరికీ తెలిసిందే. ఆయన ఎన్నెన్నో డిఫరెంట్ ప్రయోగాలు చేశారు. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’ లాంటి విభిన్న కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు ఎంత పెద్ద హిట్ హిట్ అయ్యాయో అందరికీ తెలుసు.

also read:Tollywood: డిసెంబర్ సీజన్‌పై స్టార్ హీరోల ఫోకస్.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలేనా?

- Advertisement -
Advertisement

సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ :

సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా టైటిల్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది కేవలం ఒక టైటిల్ మాత్రమే కాదు.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత పొడవైన టైటిల్. ఇది రికార్డ్ సృష్టించిందని చిత్ర బృందం చెబుతుంది.

also read:Sunday Special Movies on TV:ఈ ఆదివారం మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు.. టైమింగ్స్ ఇవే!

- Advertisement -
Advertisement

ప్రతిరోజూ ఒకే పాట ఎందుకు ప్రసారం అవుతుంది? :

ఈ చిత్ర కథాంశం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతిరోజూ సరిగ్గా పదిన్నర గంటలకు ఒక నిర్దిష్ట రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతూ ఉంటుంది. ఆ పాట అసలు ఎందుకు ప్రసారం అవుతుంది? ఆ పాట వెనక ఉన్న హిస్టరీ ఏంటి? ఆ పాటతో ఉన్న అనుబంధం ఏంటి? ఎందుకని నెమలిపాలెం నుంచి ఆ పాటను శ్రోతలు కోరుతున్నారు? అనేదే సినిమా అసలు కథ. సినిమా టైటిల్ చూస్తేనే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అని అర్థం అయిపోతుంది.

హీరోగా హర్ష.. హీరోయిన్‌గా అమైరా గోస్వామి :

ఈ సినిమాతో హర్ష హీరోగా పరిచయం అవుతున్నారు. ఇక ఆయన సరసన అమైరా గోస్వామి హీరోయిన్‌గా నటిస్తోంది. తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. టైటిల్‌తోనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంటుందనే ధీమా వచ్చేసింది. చూడాలి మరి.. సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you