Nora fatehi:బాలీవుడ్ లో నటిగా ప్రముఖ డాన్సర్ గా పేరు సంపాదించిన నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నిరంతరం ఏదో ఒక విషయంలో ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురైనట్లుగా తెలుస్తోంది. ఒక చార్టర్డ్ విమానానికి సంబంధించి ఈమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. తమ సంస్థ ప్రతిష్టను సైతం దెబ్బతీసేలా నోరా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయంటూ డ్యూన్స్ ఏవియేషన్ గుజరాత్ లోని గాంధీ నగర్ కోర్టుని ఆశ్రయించారు. ఏకంగా మూడు కోట్ల రూపాయల పరువు నష్టం కోరుతూ దాఖలు వేసినట్లు వినిపిస్తోంది.
చిక్కుల్లో పడ్డ నోరా ఫతేహి..
డ్యూన్స్ ఏవియేషన్ CJ2 విమానంలో ఈమె ప్రయాణించినట్లుగా సమాచారం. ప్రయాణ సమయంలో విమానం లోపల కొన్ని వీడియోలు చిత్రీకరించి, తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోలో విమానం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం గా మారుతున్నాయి. నోరా ఫతేహి చిన్న బొమ్మ ,లేగో ఏరోప్లేన్, టాయ్ ప్లేన్ వంటి పదాలతో అభివర్ణించినట్లు ఆ కంపెనీ ఆరోపణలు చేసింది. సోషల్ మీడియాలో నోరా ఫతేహి(Nora fatehi) కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో క్షణాలలో వైరల్ గా మారాయి.
also read:Sushmitha Konidela:బాబాయ్ పవర్ తో మెగా డాటర్ సుస్మితకి కీలక పదవి..!?
పరువు నష్టం దావా వేసిన విమానయాన సంస్థ..
దీంతో తమ విమాన సంస్థపై ప్రయాణికులలో అనుమానాలు ఏర్పడేలా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేయాల ఉన్నాయంటూ డ్యూన్స్ ఏవియేషన్ సంస్థ కోర్టు లో పేర్కొంది. ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత తమ విమానాల బుకింగ్స్ 15 నుంచి 20% వరకు తగ్గిపోయాయి అంటూ ఆ సంస్థ తెలియజేసింది కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాలను కూడా రద్దు చేసుకున్నారంటూ ఆ పిటిషన్ లో వెల్లడించారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం కంపెనీ కోర్టులో చేసిన ఆరోపణలు మాత్రమే అన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ ఆరోపణలపై కోర్టు తుది నిర్ణయం ఏంటి అన్నది చూడాల్సి ఉంది.
also read:Bigg Boss Telugu 10: రెండో రోజే రచ్చ..ఈ కంటెంస్టెంట్ బాగా ఓవర్ చేస్తున్నాడే..!
వీడియోలు తొలగించాలంటే డిమాండ్..
తమ సంస్థకు మంచి పేరు ఉందని , సాంకేతిక అంశాల పైన సరైన అవగాహన లేకుండా వాస్తవాలను ధ్రువీకరించకుండా ఒక సెలబ్రిటీ అయిన నోరా ఫతేహి ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ తమ పిటిషన్ లో కంపెనీ పేర్కొంది. కేవలం మూడు కోట్ల రూపాయల నష్టపరిహారంతో ఆగకుండా నోరా ఫతేహి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఆ వీడియోలను కూడా తొలగించాలి అంటూ డ్యూన్స్ ఏవియేషన్ కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం పైన నోరా ఫతేహి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం అయితే ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్లో వైరల్ గా మారింది.




