Bigg Boss Telugu 10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆదివారం (సెప్టెంబర్ 6) గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే రెండో రోజు నుంచే ఇంట్లో అసలు ఆట మొదలైంది. కంటెస్టెంట్ల మధ్య చర్చలు, వాదనలు, సరదా సన్నివేశాలతో సోమవారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
ఇంకా హౌస్మేట్స్ కాలేదంటూ ట్విస్ట్ :
ఇంట్లోకి అడుగుపెట్టిన 16 మంది ఇంకా పూర్తిస్థాయి హౌస్మేట్స్ కానే కాలేదు..అప్పుడే గొడవలు మొదలైయాయి. హౌస్‌మేట్స్‌గా మారాలంటే ‘మహా పరీక్ష’లో విజయం సాధించాల్సి ఉంటుందని తెలిపారు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్లలో ఉత్కంఠ మొదలైంది.
ఇప్పటికే ఎనిమిది మంది సభ్యులు పవర్ కీస్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఆ ఎనిమిది మంది మరో ఇద్దరికి పవర్ కీస్ అందించాల్సి వచ్చింది. ఇందుకోసం ఇద్దరిని ఎంపిక చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. కొంత చర్చ, వాదోపవాదాల అనంతరం టెంపర్ వంశీ, కృష్ణుడిని ఎంపిక చేశారు.
నరేష్, రాంప్రసాద్ కామెడీ :
ఎపిసోడ్లో నరేష్, రాంప్రసాద్ తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. ఇతర కంటెస్టెంట్లపై వీరిద్దరూ వేసిన ఫన్నీ కామెంట్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దేబ్జానీ అమాయకంగా మాట్లాడిన తీరు, రాంప్రసాద్ పంచ్‌లు ప్రేక్షకులను అలరించాయి.
బిగ్ బాస్‌ను ఉద్దేశించి దేబ్జానీ కూడా సరదాగా వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్(Bigg Boss Telugu 10) శాంటాక్లాజ్‌లా ఫన్నీగా ఉంటూనే స్కూల్ ప్రిన్సిపాల్లా బిల్డప్ ఇస్తున్నారని సెటైర్ వేసింది. దీనికి బిగ్ బాస్ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ.. తాను శాంటాక్లాజానా, ప్రిన్సిపాల్నా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
also read:Toxic:బాక్సాఫీస్‌లో బిగ్ డిజాస్టర్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యశ్ ‘టాక్సిక్’!
రోహిత్, రాంప్రసాద్‌కు లీడర్ బాధ్యతలు :
ఎపిసోడ్ చివర్లో అసలు హీట్ మొదలైంది. మహా పరీక్ష కోసం హౌస్ సభ్యులను రెండు గ్రూపులుగా విభజించాల్సి ఉండటంతో ఇద్దరు లీడర్లను ఎంపిక చేయాలని బిగ్ బాస్ సూచించారు. ఓటింగ్ ద్వారా రోహిత్, రాంప్రసాద్ లీడర్లుగా ఎంపికయ్యారు.
అయితే త్రిగుణ్, రాంప్రసాద్‌కు సమానంగా ఓట్లు రావడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. చివరకు త్రిగుణ్.. రాంప్రసాద్ కోసం తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీనికి ఆయన చెప్పిన కారణం మరో చర్చకు దారితీసింది. రోహిత్‌కు అగ్నిపరీక్షలో పాల్గొన్న సభ్యులే ఓట్లు వేశారని త్రిగుణ్ వ్యాఖ్యానించగా, షాలిని మాత్రం రోహిత్ ప్రతిభను చూసే ఓటు వేశామని స్పష్టం చేసింది. దీంతో మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది.
also read:Tollywood:క్రిస్మస్ బరిలో బాలయ్య vs నాగార్జున.. 2004 సీన్ రిపీట్ అవుతుందా?
కప్పులు కడగడంపై రచ్చ :
రోహిత్ హౌస్‌లో కనీసం కప్పులు కూడా కడగలేదని త్రిగుణ్ ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై రోహిత్ తీవ్రంగా స్పందిస్తూ.. మీరు ఎంగిలి చేసిన కప్పులను నేను ఎందుకు కడగాలని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక పవర్ కీ ఓపెన్ చేసే సమయంలో జబర్దస్త్ నరేష్ ఎదుర్కొన్న పరిస్థితి కూడా నవ్వులు పూయించింది. తనకు వచ్చిన పవర్ ఏమిటో అర్థం కాక తల పట్టుకున్న నరేష్.. అందులో రాసింది అర్థమయ్యేలా చెప్పాలని బిగ్ బాస్‌ను కోరాడు. ఇలా కామెడీ, గొడవలు, ఆసక్తికరమైన టాస్క్‌లతో రెండో ఎపిసోడ్ ముగిసింది.




