Varanasi Movie:రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “వారణాసి”. ఈ సినిమాలో హీరోగా తెలుగు సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తుండగా, బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చి చాలా కాలమే అవుతుంది. అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏవీ కూడా అభిమానులను సాటిస్ఫై చేసే విధంగా రావడం లేదు.
మహేష్ బాబు పుట్టినరోజున అప్డేట్పై ఆశలు :
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఏదో ఒక వీడియో కచ్చితంగా రిలీజ్ చేస్తారు అంటూ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం చిన్న లుక్‌తో సర్ప్రైజ్ చేసి వదిలేశాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్‌గా హర్ట్ అయిపోయారు. మహేష్ బాబు లాంటి హీరో పుట్టినరోజుకు ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక టీజర్ రిలీజ్ చేయాల్సింది అంటూ బాధపడ్డారు.
also read:Bigg Boss 10:రెండో రోజే బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ.. రోహిత్‌పై వర్షిణి సంచలన వ్యాఖ్యలు!
ఏఐ వీడియోతో ఫ్యాన్స్ క్రియేటివిటీ :
అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి రిలీజ్ చేయకపోతే మేమే వారణాసి(Varanasi Movie) సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాం అంటూ కొన్ని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు వారిలో ఒకరు క్రియేట్ చేసిన అసలు సినిమాకు సంబంధించిన ఒక ఏఐ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది.
also read:TV:బుధవారం టీవీల్లో సినిమాల సందడి.. ఏ ఛానెల్లో ఏ సినిమా అంటే?
ప్రియాంక చోప్రా ఫైట్ సీన్ వైరల్ :
రాజమౌళి కూడా ఇంత రేంజ్లో తెరకెక్కించలేదేమో అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా ఫైట్ సీన్, మహేష్ బాబు గ్రాఫిక్ విజువల్స్ సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఒకందుకు నిజంగానే ఇది రాజమౌళి ఇలా తెరకెక్కించుకుంటారా అన్న ఆలోచనలు కూడా కలగజేస్తుంది. అంతలా చాలా క్యూరియాసిటీ తెప్పిస్తుంది ఈ ఏఐ వీడియో.
నెటిజన్ల కామెంట్స్ :
సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ వీడియోను చూస్తుంటే రాజమౌళి సినిమాలపై ఉన్న తమ అంచనాలను అందుకోలేరేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, మరికొందరు మాత్రం వీడియోను అద్భుతంగా రూపొందించారని, ఇందులోని క్రియేటివిటీ, టాలెంట్‌ను ప్రశంసిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. నెటిజన్ల కామెంట్లు వైరల్‌గా మారుతున్నాయి.
రాజమౌళి అప్డేట్ కోసం ఎదురుచూపులు :
మరి కొంతమంది మాత్రం ఇవి ఎలాగైనా సరే రాజమౌళి కి చేరేలా చేసి, త్వరగా వారణాసికి సంబంధించిన ఏదో ఒకటి బయటపడేలా చేసుకోవాలి అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తే ఎలా ఉంటుంది అనేది ఊహిస్తూ భలే గమ్మత్తుగా వీడియోలు తయారు చేస్తున్నారు.
😭 Evado serious ga teesukunnatu unnadu… https://t.co/3IPueiHfQ5 pic.twitter.com/WoEDBEAl41
— 𝑺𝒖𝒄𝒉𝒂𝒏𝒅𝒓𝒂 (@snvvs369) September 8, 2026




