Fauzi movie:డైరెక్టర్ హను రాఘవపూడి, ప్రభాస్ హీరోగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న చిత్రం ఫౌజీ. ఈ సినిమా స్వతంత్రం రాకముందు జరిగిన ఒక యుద్ధ ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే పోస్టర్ల ద్వారా ప్రకటించారు. నిన్నటి రోజున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్లను చిత్ర బృందాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఫౌజీ సినిమాకు సంబంధించి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో సుభాష్ చంద్రబోస్ హిట్లర్ తో మాట్లాడుతూ ఫౌజీ అనే సోల్జర్ గురించి చాలా గొప్పగా అభివర్ణిస్తూ చెప్పిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది.
ఫౌజీ గ్లింప్స్ లో అందరినీ ఆకట్టుకున్న నేతాజీ..
అయితే ఈ గ్లింప్స్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నోటి నుంచి ఫౌజీ(Fauzi movie) గురించి చెప్పించడం మరొక ఎత్తు. హిట్లర్, సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ కలిసి ఒక భారతీయ గూఢచారి గురించి చర్చించుకోవడం సినిమా పైన అంచనాలను ఒక్కసారిగా పెంచేసిందని చెప్పవచ్చు. గ్లింప్స్ లో హిట్లర్, సుభాష్ చంద్రబోస్ చాలా సహజంగానే అచ్చం నిజమైన నాయకుడిలా కనిపించడంతో ఇవి ఏఐ సహాయంతో క్రియేట్ చేసిన పాత్రలని చాలామంది వైరల్ చేస్తున్నారు . కానీ అవి విజువల్స్ కావు నిజమైన నటీనటులే అంటూ వారికి సంబంధించిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:Priya Vadana :కరుప్పు మూవీ నటి ప్రియవదన ఆత్మహత్య..!
నేతాజీ పాత్రలో నటించింది ఎవరంటే?
ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ పాత్రలో అచ్చు గుద్దినట్లు నటించిన ఆ నటుడు గురించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఆ నటుడు మరాఠీ నటుడు సుభోద్ బావే. మరాఠీ సినీ పరిశ్రమలో నటుడుగా బాగా విశేషమైన గుర్తింపు కలదు. ఆయన కేవలం నటుడు గానే కాకుండా డైరెక్టర్గా, రచయితగా, నిర్మాతగా, నాటకాల నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1990లో నాటక రంగంలో తన నటన ప్రయాణాన్ని మొదలుపెట్టారు సుభోద్ బావే. 2002 లో మరాఠి హిందీ చిత్రాలలో నటించారు. అలాగే మలయాళం, కొంకని వంటి భాషలలో కూడా విభిన్నమైన పాత్రలలో కనిపించారు.
also read:Immortal movie OTT:కయాదు లోహర్ హర్రర్ మూవీ ఓటీటిలోకి ఎప్పుడంటే..?
20కి పైగా సీరియల్స్.. 50 కి పైగా చిత్రాలు..
దాదాపుగా 20 కి పైగా సీరియల్స్, 50 కి పైగా మరాఠీ చిత్రాలలో నటించారు. దాదాపుగా బాలీవుడ్ లో కూడా ఒక పది చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు సుభోద్ బావే. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్టేట్ అవార్డులలో ఏకంగా ఐదుసార్లు బెస్ట్ యాక్టర్ అవార్డులను కూడా అందుకున్నారు.. వివిధ సంస్థలకు చెందిన అవార్డులలో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ , బెస్ట్ యాక్టర్ అవార్డులను కూడా అందుకున్నారు సుభోద్ బావే. అయితే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఫౌజీ సినిమా లో కనిపించి పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత సుభోద్ బావే పాన్ ఇండియా నటుడుగా మారడం ఖాయమని అభిమానులు సైతం భావిస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని సినిమాలలో నటించే అవకాశాలు లభిస్తాయో చూడాలి మరి.




