Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ మొదలయ్యిందంటే చాలు చాలామంది ఈ షో చూడడానికి మక్కువ చూపుతుంటారు. కొన్నిసార్లు బిగ్ బాస్ షో వివాదాలలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా షో పాపులారిటీ అవుతుంది. ముఖ్యంగా అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా లవ్ ట్రాక్ వంటివి జరపడం కామన్ గా మారిపోయింది. అయితే అందులో కొంతమంది నిజంగానే ప్రేమలో పడితే.. మరి కొంతమంది కేవలం ఫుటేజ్ ల కోసం కూడా చేస్తూ ఉంటారు. ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదలైన సంగతి అందరికీ తెలిసింది.
హౌస్ లో లవ్ ట్రాక్ మొదలు..
అయితే ఇందులో అలాంటి లవ్ ట్రాక్ లు ఏవీ కనిపించలేదు కానీ ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో చూస్తే మాత్రం అందులో ఒక కొత్త లవ్ ట్రాక్ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హృదయానికి దగ్గరగా అయ్యింది ఎవరు? దూరం చేస్తున్నది ఎవరు? అనే ప్రశ్న కంటెంట్స్ ని హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరుగా చెప్పమని ప్రశ్నించగా.. అందులో శనివారం రోజున కొంతమంది చెప్పగా మిగిలిన వారు ఆదివారం రోజు తెలిపారు. రాంప్రసాద్ మాట్లాడుతూ.. దెబ్జాని హృదయానికి దగ్గర అయిందని చెబుతారు. మీ కామెడీ అంటే ఇష్టమని రాంప్రసాద్ అని నాతో చెప్పిందని , కానీ ఆ తదుపరి రోజు కోపంగా నేను నీతో మాట్లాడను అంటూ షాలిని చెప్పినట్లు రాంప్రసాద్ తెలిపారు.
ALSO READ: Dhee 10 Raju: ఢీ – 10 విన్నర్ రాజుపై వేధింపుల కేసు!
పట్టించుకోవడం లేదు అంటున్న దేబ్జానీ..
ఇలా ఒక్కొక్కరుగా చెబుతూ ఉండగా మరో కంటెస్టెంట్ తో నాగార్జున.. ముఖేష్ నీ గురించి ఒకటి చెప్పాలి? నీ కళ్ళు బాగుంటాయని చెప్పగా.. మీరు చెబుతుంటే బాగుంది సార్ నమ్మాలని ఉంది అంటూ ముఖేష్ కూడా సమాధానం చెబుతారు. దేబ్జాని చెప్పినప్పుడు నమ్మలేదా అంటూ నాగార్జున సెటైర్ వేస్తారు. వెంటనే దేబ్జాని మాట్లాడుతూ నాకు నిజంగానే అనిపించింది కాబట్టే చెప్పాను అని చెప్పగా.. ఆ వెంటనే ముఖేష్ మాట్లాడుతూ నీ కళ్ళు కూడా బాగానే ఉంటాయి అంటూ దేబ్జాని కి సమాధానం చెబుతారు.
ALSO READ:OTT:వణికించే సీన్లు.. ఊహించని ట్విస్టులు.. జియోహాట్స్టార్లో 4 హారర్ థ్రిల్లర్స్!
ముఖేష్ యాక్సెప్ట్ చేస్తారా?
ఆ వెంటనే నాకు ముఖేష్ అంటే చాలా ఇష్టం సర్. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నాను ఇటు సైడ్ పులిహోర కలుపుతున్నాడు.. అటు సైడ్ పులిహోర కలుపుతున్నాడు.. కానీ నా దగ్గరికి మాత్రం రాలేదు సార్ అంటూ దేబ్జాని అనడంతో ఒక్కసారిగా నవ్వేశారు. మరి ఈ విషయం పైన ముఖేష్ ఏం సమాధానం చెప్పాడు అనే విషయం తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే..




