Thursday, September 17, 2026
HomeLATESTGetup Srinu:జబర్దస్త్ కమెడియన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే..!

Getup Srinu:జబర్దస్త్ కమెడియన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే..!

Getup Srinu: గెటప్ శ్రీను ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయన రెమ్యూనరేషన్ వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Getup Srinu:జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి కొంతమంది డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. అలా జబర్దస్త్ ద్వారా మంచి క్రేజీ సంపాదించిన వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. పేరుకు తగ్గట్టుగానే విభిన్నమైన గెటప్ లతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్, సన్నీ, గెటప్ శ్రీను కామెడీ స్కిట్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంటాయి. యూట్యూబ్ లో కూడా వీరి కామెడీ కి భారీగానే వ్యూస్ లభిస్తూ ఉంటాయి. గెటప్ శ్రీను ఈమధ్య జబర్దస్త్ ని వదిలేసి మరి సినిమాలలో బిజీగా మారిపోయారు.

వరుస చిత్రాలతో బిజీగా మారిన గెటప్ శ్రీను..

మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా గెటప్ శ్రీను(Getup Srinu) కామెడీ కి ఫిదా అవుతున్నారంటే ఎంతలా కామెడీ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉన్న కమెడియన్లలో కూడా గెటప్ శ్రీను టాప్ లో ఉన్నారని చెప్పవచ్చు. యంగ్ హీరోలతో కామెడీ టైమింగ్ తో మంచి పాపులారిటీ సంపాదించారు. అలా ఏడాదికి 6 నుంచి 8 సినిమాలలో కనిపిస్తున్న గెటప్ శ్రీను.. ఇటీవలే వచ్చిన లెనిన్ సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం సినిమాలు , టీవీ షోలతో బిజీగా ఉన్న గెటప్ శ్రీను రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంపై నెటిజన్స్ సైతం తెగ వేతికేస్తున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Sri Devi: శ్రీదేవి ఆస్తుల వివాదం పై బిగ్ ట్విస్ట్.. ఫ్యామిలీకి నోటీసులు..!

లక్షల్లో ఆదాయం..

దర్శక నిర్మాతలు కూడా గెటప్ శ్రీను క్రేజ్ ను సైతం దృష్టిలో పెట్టుకొని, అతను అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సినిమాలలోకి తీసుకుంటున్నారు. సినిమాకి 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏడాది పొడవునా సినిమాలు చేస్తున్న గెటప్ శ్రీను.. జబర్దస్త్ కమెడియన్గా ఏడాదికి భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. గెటప్ శ్రీను ఎంతోమంది హీరోల డైలాగులను ఇమిటేట్ చేస్తూ కూడా బాగానే పాపులారిటీ సంపాదించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Dada Saheb falke award:కేజిఎఫ్ నటుడికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు..!

మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం అంటూ..

ముఖ్యంగా టాలీవుడ్ లో ఉండే మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు తనకు ఇష్టమని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. అలాగే పొలిటికల్ పరంగా కూడా జనసేన పార్టీ వైపుగా అడుగులు వేశారు. పవన్ కళ్యాణ్ గెలుపులో జబర్దస్త్ కమెడియన్స్ హస్తం ఉందని కూడా చెప్పవచ్చు. ఈమధ్య బుల్లితెరకు దూరమై వెండితెరకు దగ్గరయ్యారు గెటప్ శ్రీను.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you