Happy Journey Movie Review: తెలుగు తెరపై ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కథలు కొత్తవి కాకపోయినా.. ఒకే ప్రయాణంలో ఏడుగురు మహిళల జీవితాలను, వారి విభిన్న ఆలోచనా విధానాలను చూపించే ప్రయత్నం చేసింది ‘హ్యాపీ జర్నీ’. (Happy Journey Movie Review)అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రల్లో నటించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించారు. ఫ్రాన్స్ అందాలను నేపథ్యంగా చేసుకుని కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, వ్యక్తిగత సమస్యలను కలిపి కథను నడిపించారు. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా అభిమానులని ఎలా ఆకట్టుకుంది అనేది ఇప్పుడు ఇక్కడ రివ్యూలో చదివి తెలుసుకుందాం..!
కథ :
గోవింద్, అప్పారావు కలిసి ఓ ట్రావెల్ కంపెనీ నిర్వహిస్తుంటారు. నష్టాల్లో ఉన్న సంస్థను తిరిగి నిలబెట్టేందుకు ఏడుగురు మహిళలను ఉచితంగా ఫ్రాన్స్‌కు తీసుకెళ్లే ప్రణాళిక వేస్తారు. సావిత్రి, చాముండేశ్వరి, నయన, శ్రీలత, తన్వి, విహన, దివ్య.. ఇలా విభిన్న నేపథ్యాలకు చెందిన మహిళలు ఈ ప్రయాణంలో భాగమవుతారు. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య ఉంటుంది. పెళ్లిపై సందిగ్ధంలో ఉన్న యువతి నుంచి విడాకుల సమస్యతో బాధపడుతున్న మహిళ వరకు వారి జీవితాల్లోని అంశాలు కథలో భాగమవుతాయి. ఫ్రాన్స్‌లో సరదాగా సాగుతున్న ప్రయాణంలో దివ్య అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఆమె ఏమైంది? ఈ ప్రయాణం వెనుక గోవింద్ ఉద్దేశం ఏమిటి? చివరికి ఈ ఏడుగురి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేదే కథ.
also read:Avantika Mishra: చీరకట్టులో గ్లామర్ టచ్ ఇస్తూ సెగలు పుట్టిస్తున్న అవంతిక మిశ్రా!
విశ్లేషణ :
ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు కథను ఎక్కువగా కామెడీ, ట్రావెల్ ఎపిసోడ్స్‌తో నడిపించారు. ఫ్రాన్స్‌లో ఏడుగురు మహిళల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, సరదా సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయి. అన్నపూర్ణమ్మకు సంబంధించిన కామెడీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. దివ్య అదృశ్యమయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్ రెండో భాగంపై ఆసక్తిని పెంచుతుంది.
సెకండ్ హాఫ్‌లో మహిళల వ్యక్తిగత జీవితాలు, కుటుంబ సమస్యలు, స్వేచ్ఛ, వ్యక్తిగత నిర్ణయాల వంటి అంశాలను చూపించే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను తాకవు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో గోవింద్ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కథకు కొత్త కోణాన్ని తీసుకొస్తుంది. కుటుంబ విలువలను ప్రస్తావిస్తూ ఇచ్చిన ముగింపు సినిమాకు కొంత బలాన్ని అందిస్తుంది.
also read:Getup Srinu:జబర్దస్త్ కమెడియన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే..!
నటీనటుల పర్ఫార్మెన్స్ :
అన్నపూర్ణమ్మ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మోడ్రన్ లుక్‌లో కనిపిస్తూ కామెడీ టైమింగ్‌తో అలరిస్తారు. ఆమని తన పాత్రలో సహజంగా నటించారు. ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సునైనా భయపడే, ఆందోళన చెందే పాత్రలో కొత్తగా కనిపించారు. వంశీ, రవి శివతేజ తమ కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో నవ్వించారు.
టెక్నికల్ టీమ్ :
ఫ్రాన్స్ లొకేషన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సినిమాటోగ్రఫీ ద్వారా అక్కడి అందాలను చక్కగా చూపించారు. కొన్ని సన్నివేశాలు ట్రావెల్ వ్లోగ్‌ను తలపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా మరింత కాంపాక్ట్‌గా ఉండేది.
ప్లస్‌లు :
*ఫ్రాన్స్ అందమైన లొకేషన్స్
*అన్నపూర్ణమ్మ కామెడీ
*ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్
*క్లైమాక్స్ ట్విస్ట్
*ఫ్యామిలీ ఎమోషన్
మైనస్‌లు :
*సెకండ్ హాఫ్‌లో సాగదీత
*కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కనెక్ట్ కాకపోవడం
*కొన్ని పాత్రల ప్రవర్తన సహజంగా అనిపించకపోవడం
*ఎడిటింగ్‌లో మరింత కత్తెర అవసరం
పంచ్ లైన్ : ‘హ్యాపీ జర్నీ’.. నవ్వులు, భావోద్వేగాల ఫ్యామిలీ ట్రిప్!




