Friday, September 18, 2026
HomeLATESTMissing Meghana Review: ఊహించని ట్విస్టులతో సాగిన మిస్టరీ థ్రిల్లర్!

Missing Meghana Review: ఊహించని ట్విస్టులతో సాగిన మిస్టరీ థ్రిల్లర్!

Missing Meghana Review:రామ్ కార్తిక్, అంకిత్ కొయ్య, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ, రేటింగ్‌ను ఇక్కడ తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Missing Meghana Review:యంగ్ హీరోలు రామ్ కార్తిక్, అంకిత్ కొయ్య, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’(Missing Meghana Review). వాచస్పతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫస్ట్ కాపి మూవీస్, కేడీ అండ్ కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు. వనరాజ్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా.. గోపరాజు రమణ, వెంప కాశి, వైదిక సెంజాలియా, మహిపాల్, రుచిత, నళిని తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.ఈ చిత్రం నేడు శుక్రవారం (సెప్టెంబర్‌ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌తో పాటు పాటలు కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి, అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంది? కథ, కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉన్నాయి? తెలుసుకోవాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ :

మేఘన (అమ్ము అభిరామి) రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి ఆందోళన చెందుతాడు. వెతికే క్రమంలో స్కూటీ, బ్యాగ్ కనిపించడంతో కిడ్నాప్ అయిందనే అనుమానంతో పోలీసులను ఆశ్రయిస్తాడు. మొదట కేసును పెద్దగా పట్టించుకోని ఎస్‌ఐ.. ఆ తర్వాత ఏసీపీ రంగంలోకి దిగడంతో దర్యాప్తు వేగం పుంజుకుంటుంది. మేఘనను అనుసరించిన వ్యక్తి, బేకరీలో పనిచేసే యువకుడు, స్థానిక రౌడీ తదితరులను పోలీసులు విచారిస్తారు.

- Advertisement -
Advertisement

ఈ క్రమంలో మేఘనకు కార్తీక్ (రామ్ కార్తిక్)తో ఉన్న పరిచయం బయటపడుతుంది. అతని గత ప్రేమకథతో పాటు మేఘనతో పరిచయం ఎలా ఏర్పడిందనే అంశాలు ఒక్కొక్కటిగా రివీల్ అవుతాయి. మరోవైపు మేఘనకు ఏసీపీతో పెళ్లి కూడా నిశ్చయమై ఉంటుంది. ఇంతకీ మేఘన ఏమైంది? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? అసలు కార్తీక్ పాత్ర ఏమిటి? అంకిత్ కొయ్య పాత్రలో దాగి ఉన్న రహస్యం ఏంటి? అనేది తెరపై చూడాలి.

విశ్లేషణ :

సస్పెన్స్, మిస్టరీతో పాటు లవ్ ట్రాక్‌ను మిక్స్ చేసిన కథ ఇది. ప్రారంభం నుంచే దర్యాప్తు, అనుమానితులు, ట్విస్టులతో సినిమా ఆసక్తిని రేకెత్తిస్తుంది. మేఘన, కార్తీక్ పరిచయం వెనుక ఉన్న అంశాలను దర్శకుడు కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అంకిత్ కొయ్య పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది.

- Advertisement -
Advertisement

అయితే కొన్ని మలుపులు ముందుగానే ఊహించే అవకాశం ఉండటం సినిమాకు మైనస్. ఫస్టాఫ్ వేగంగా సాగగా.. సెకండాఫ్‌లో లవ్ ట్రాక్ కొంత సాగదీసిన భావన కలుగుతుంది. పాత్రల మధ్య భావోద్వేగాలు మరింత బలంగా చూపించి ఉంటే ప్రభావం పెరిగేది. తండ్రీకూతుళ్ల బంధం కూడా పూర్తిస్థాయిలో కనెక్ట్ కాదు. క్లైమాక్స్‌ను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది.

also read:Happy Journey Movie Review: ట్రావెల్, కామెడీ, ఎమోషన్స్.. ఈ జర్నీ ఎలా సాగిందంటే?

- Advertisement -
Advertisement

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

రామ్ కార్తిక్ ప్రేమ విఫలమైన యువకుడిగా, ఆ తర్వాత మేఘనతో ఏర్పడే బంధంలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అమ్ము అభిరామి మేఘన పాత్రలో సహజంగా కనిపించి మెప్పించింది. అంకిత్ కొయ్య తన పాత్రలోని ట్విస్ట్‌కు న్యాయం చేశాడు. గోపరాజు రమణ తనదైన శైలిలో ఆకట్టుకోగా.. ఏసీపీగా వెంప కాశి మంచి నటన కనబరిచారు. మహిపాల్ కూడా తన పాత్ర పరిధిలో మెప్పించాడు.

also read:Avantika Mishra: చీరకట్టులో గ్లామర్ టచ్ ఇస్తూ సెగలు పుట్టిస్తున్న అవంతిక మిశ్రా!

టెక్నికల్ టీం :

ఆర్‌ఆర్ ధృవన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. ముఖ్యంగా రెండు మెలోడీ పాటలు, బ్రేకప్ సాంగ్ ఆకట్టుకుంటాయి. శ్యామ్ కే నాయుడు కెమెరా పనితనం బాగుంది. బసవా ఎడిటింగ్ షార్ప్‌గా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల కంటిన్యూటీ విషయంలో లోపాలు కనిపిస్తాయి. వనరాజ్ కథ, స్క్రీన్‌ప్లేకు దర్శకుడు వాచస్పతి మంచి టేకింగ్ జోడించారు.

ప్లస్‌లు :

*ఆసక్తికరమైన మిస్సింగ్ కేసు

*కొన్ని ట్విస్టులు, టర్న్స్

*రామ్ కార్తిక్, అమ్ము అభిరామి నటన

*సంగీతం, విజువల్స్

*తక్కువ నిడివి

మైనస్‌లు :

*కొన్ని ట్విస్టులు ముందే ఊహించేలా ఉండటం

*సెకండాఫ్‌లో సాగదీత

*భావోద్వేగాలు పూర్తిస్థాయిలో పండకపోవడం

*క్లైమాక్స్ మరింత బలంగా ఉండాల్సింది

పంచ్ లైన్ :

ట్విస్టులతో కొంత థ్రిల్ పంచే ‘మిస్సింగ్ మేఘన’.. మిస్టరీ మూవీ లవర్స్‌కు ఓకే టైమ్‌పాస్.

రేటింగ్: 2.75/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you