Friday, September 18, 2026
HomeLATESTThe Paradise: ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్లో కనిపించని కయాదు లోహార్..!

The Paradise: ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్లో కనిపించని కయాదు లోహార్..!

The Paradise: ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ లో కయాదు లోహర్ కనిపించకపోవడంతో వస్తున్న వార్తలపై నాని స్పందించారు.

on
- Advertisement -banner Ad

The Paradise: నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ది ప్యారడైజ్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్స్ ను కూడా మరింత వేగవంతం చేశారు. అయితే ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ కయాదు లోహార్ ఎక్కడ కనిపించకపోవడంతో అభిమానులు ఆరా తీస్తున్నారు. అసలు కయాదు లోహర్ సినిమా ప్రమోషన్స్లో ఎందుకు రావడం లేదు? ఆమెకు చిత్ర బృందానికి మధ్య ఏదైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయంపై హీరో నాని ఇచ్చిన సమాధానంతో క్లారిటీ ఇచ్చారు.

ప్రమోషన్స్ కి దూరం.. స్పందించిన నాని..

ది ప్యారడైజ్ (The Paradise)సినిమా ప్రమోషన్స్ లో కాయాదులోహర్ ఎందుకు కనిపించడం లేదంటూ రిపోర్టర్ హీరో నానిని ప్రశ్నించగా.. ఆమె బిజీ షెడ్యూల్ కారణం వల్ల ఇతర కార్యక్రమాలకు హాజరు కావడం లేదా అంటూ అడగగా? అందుకు నాని తనదైన స్టైల్ లో సమాధానాన్ని తెలిపారు. ఈ ప్రశ్నకు తన దగ్గర ఒక అద్భుతమైన సమాధానం ఉందని కయాదు ప్రస్తుతం కోలీవుడ్లో ప్రముఖ డైరెక్టర్ మారి సెల్వరాజు సినిమా షూటింగ్లో బిజీగా ఉందని తెలిపారు. మారి సెల్వరాజ్ ఒక మంచి సినిమా చేస్తున్నారని, అందులో ఆమె హీరోయిన్గా నటిస్తోందని చెప్పారు.

- Advertisement -
Advertisement

also read:Missing Meghana Review: ఊహించని ట్విస్టులతో సాగిన మిస్టరీ థ్రిల్లర్!

డైరెక్టర్ ఒప్పుకోలేదు..

అయితే ఆ సినిమా షూటింగ్ నుంచి ఆమె ఈ ప్రెస్ మీట్ కి రావడానికి డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఒప్పుకోలేదని నాని సరదాగా తెలిపారు. అందువల్లే కయాదు చెన్నై ప్రెస్ మీట్ కు హాజరు కాలేకపోయిందని కూడా తెలిపారు నాని. హీరోయిన్ ప్రమోషన్స్ కు రాకపోవడంతో సాధారణంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి. సినిమా టీం తో ఏదైనా విభేదాలు ఉన్నాయా? లేకపోతే డేట్స్ సమస్యలు వచ్చాయా? మరి ఏదైనా కారణమా? అంటూ సోషల్ మీడియాలో నిరంతరం ఏదో ఒక విషయం గురించి వైరల్ గా మారుతుంది. అలాంటి ఊహగానాలే ది ప్యారడైజ్ సినిమా విషయంలో కయాదు లోహార్ పైన వినిపించడంతో ఈ విషయం పైన నాని క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Happy Journey Movie Review: ట్రావెల్, కామెడీ, ఎమోషన్స్.. ఈ జర్నీ ఎలా సాగిందంటే?

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా వస్తుందా?

ది ప్యారడైజ్ చిత్రంలో నానికి జోడిగా కయాదు లోహర్ నటిస్తోంది. ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారు. కీలకమైన పాత్రలో సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 21న హైదరాబాదులో ది ప్యారడైజ్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇప్పటివరకు ప్రమోషన్స్ కి దూరంగా ఉన్న కయాదు లోహర్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి వస్తుందా రాదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని వాటన్నిటికీ చెక్ పెడుతుందేమో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you