Varanasi:ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులే కాకుండా, దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిత్రాలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా.. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటివరకు వారణాసి సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా పైన మరింత ఆసక్తిని పెంచేలా చేసింది. ముఖ్యంగా వారణాసి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో లీకైన వీడియోలు , ఫోటోలు కూడా అందరినీ ఆశ్చర్యపరిచేలా కనిపిస్తున్నాయి.
రోజురోజుకు వారణాసి పై పెరుగుతున్న అంచనాలు..
అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వినిపించే వార్తలు కూడా వారణాసి సినిమా ఎలా ఉండబోతుందో చూసేందుకు అభిమానులను ఎగ్జైటింగ్ అయ్యేలా చేస్తుంది. వారణాసి (Varanasi)చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 07 వ తేదీన దాదాపుగా 120 దేశాలకు పైగా వారణాసి సినిమా కనివిని ఎరుగని రీతిలో విడుదల కాబోతోంది. వారణాసి సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేసి మరి వీఎఫ్ ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పైన చిత్ర బృందం ప్రత్యేకించి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
also read:Udaya Bhanu:”నాకు కవల పిల్లలు పుట్టడానికి కారణం అదే”..సీక్రేట్ బయటపెట్టిన ఉదయభాను..!
రుద్ర నుండి శ్రీరాముడిగా..
తాజాగా వారణాసి సినిమా నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ సీన్స్ హైలెట్ గా ఉంటుందని , ఇటీవల డైరెక్టర్ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంతేకాకుండా వారణాసి మొదటి భాగంలో రుద్రాకు తన తండ్రికి ఉన్న ఎమోషనల్ సీన్స్ హైలైట్ గా ఉంటాయని , ఆ తర్వాత ఇంటర్వెల్ కొంతసేపటి తర్వాత గ్లోబ్ ట్రోటర్ గా వున్న రుద్ర శ్రీరాముడిగా మారుతారని వినిపిస్తోంది .ఇందుకు సంబంధించి విజువల్స్ ని మనం గ్లింప్స్ లోనే చూడొచ్చు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం థియేటర్లలో మహేష్ అభిమానులకు పూనకాలు ఖాయమంటూ నేటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు.
also read:The Paradise nani: నానిని తొక్కేయడానికి చూస్తున్నది ఆ నలుగురేనా..? ఫ్యాన్స్ కనిపెట్టేశారు..!
మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్..
వారణాసి సినిమా పైన నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం కేవలం టైం ట్రావెల్ స్టోరీ మాత్రమే కాదు అని అంతకుమించి ఉంటుందంట. ఇటీవల తాను నటించిన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని తెలియజేశారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రియాంక చోప్రా వంటి వారితో కలిసి పనిచేయడం కూడా తనకి ఆనందాన్ని కలిగించిందంటూ తెలియజేశారు. అటు పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలతో కూడా వారణాసి సినిమా పైన రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసి సినిమా ఓటీటి డీల్ కూడా పూర్తి అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు కెరియర్ లోనే వారణాసి సినిమా సరికొత్త రికార్డులను తిరగ రాస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరి అభిమానులు అంచనాలను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 7 తేది వరకు ఆగాల్సిందే.




