Tuesday, September 22, 2026
HomeLATESTNani:స్టేజ్ పై నానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన లేడీ అభిమాని..!

Nani:స్టేజ్ పై నానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన లేడీ అభిమాని..!

Nani:నేచురల్ స్టార్ నాని ఈవెంట్‌లో ఓ లేడీ అభిమాని చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది.

on
- Advertisement -banner Ad

Nani:సాధారణంగా తమ అభిమాన హీరోని చూస్తే ఫ్యాన్స్ ఎలా ఒళ్లు మరిచిపోయి మైమరచిపోతారో అందరికీ తెలుసు. అసలు భూమ్మీద ఉన్నామా..? లేదా..? అన్నట్లు ఉంటారు వాళ్లు. ఎప్పటినుంచో దేవుడికంటే ఎక్కువగా ఆరాధిస్తున్న ఫేవరెట్ హీరోని డైరెక్ట్‌గా చూస్తే ఆ ఆనందం వర్ణాతీతం. ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నామనేది పూర్తిగా మర్చిపోతాం. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అయితే కొన్ని కొన్ని సార్లు అదే రాంగ్ రూట్‌లో కూడా పోట్రేట్ అవుతుంది.

నాని అభిమాని విషయంలో అదే జరిగింది :

ఇప్పుడు తాజాగా నేచురల్ స్టార్ నాని (Nani)అభిమాని విషయంలో అదే జరిగింది. నేచురల్ స్టార్ హీరో నాని తాజాగా నటించిన సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్న హైదరాబాద్‌లో బాగా ఘనంగా నిర్వహించారు.

- Advertisement -
Advertisement

అంతేకాదు, నేచురల్ స్టార్ ఈసారి ఒక అడుగు ముందుకు వేసి తన అభిమానులను కలుసుకోవడానికి ఏకంగా ఒక ఈవెంట్‌ను నిర్వహించారు. అభిమానుల కోసం నాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అభిమానుల కోసం భారీ ఏర్పాట్లు :

నాని తన అభిమానులను గుండెల్లో పెట్టుకుంటాడు అన్న విషయం అందరికీ తెలుసు. ఆ విషయం మరోసారి ప్రూవ్ అయింది. నాని ఓ భారీ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ సారథి స్టూడియోస్‌లో ఏకంగా ఒక ఫ్లోర్ మొత్తాన్ని బుక్ చేసేసుకున్నారు.

- Advertisement -
Advertisement

తమ అభిమాన హీరోని కలుసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది జనాలు అక్కడికి చేరుకున్నారు. ఈ ఈవెంట్‌లో నాని చాలా ఓపికగా ఫ్యాన్స్‌తో మీట్ అయ్యారు. అందరికీ దగ్గరుండి సెల్ఫీలు ఇప్పించారు.

అంతేకాదు, తనని చూడడానికి వచ్చిన అభిమానులు ఆకలితో వెళ్లకూడదు అంటూ 10,000 మందికి భోజనాలను రెడీ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Varanasi:వారణాసి సినిమాలో ఇంటర్వెల్ సీన్స్ ఇలా ఉండనుందా. ?

నానితో ఫోటో కోసం అభిమాని హంగామా :

అయితే నాని కోసం అభిమాని చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో బాగా దుమారం రేపుతోంది. నానితో ఫోటో దిగడానికి స్టేజ్ పైకి వచ్చిన ఆ అభిమాని ఏదో పాటకు డ్యాన్స్ చేస్తూ స్టేజ్ పైకి వచ్చింది. అంతేకాదు, నానిని డ్యాన్స్ చేయమంటూ బలవంతం చేసింది.

నాని కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతూనే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే పక్కనే ఉన్న లేడీ బౌన్సర్ ఆమెను చేయి పట్టుకొని గట్టిగా లాగడానికి ప్రయత్నించింది. దీంతో అభిమాని సైతం కొంత కోపానికి గురైంది.

also read:Udaya Bhanu:”నాకు కవల పిల్లలు పుట్టడానికి కారణం అదే”..సీక్రేట్ బయటపెట్టిన ఉదయభాను..!

పరిస్థితిని చక్కదిద్దిన నాని :

వెంటనే నాని దగ్గరుండి ఫోటో ఇప్పించి, స్టేజ్ దిగి పంపించేలా చూసాడు. అప్పటికే అభిమాని ఆనందం ఎక్కువైపోయింది. నానితో ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నట్లే ఉండింది. ఇంతలోనే ఆ లేడీ బౌన్సర్ చేయి పట్టుకొని ఆమెను కిందకు దించేసింది.

దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్‌గా మారింది. కొంతమంది నానికే ఈ అభిమాని దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చేసిందంటూ, ఇంత ఎనర్జీ, ఇంత అభిమానం అంటూ కౌంటర్స్ వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you