The Paradise first review: నాచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 24వ తేదీన భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక్కరోజు ముందు రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రీమియర్ షోలు కూడా పడనున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ , గ్లింప్స్, టీజర్ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేశాయి. దీంతో ట్రైలర్ కూడా విడుదల చేయకుండా ఈ సినిమాని డైరెక్ట్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు నాని.
ది ప్యారడైజ్ సినిమా ఫస్ట్ రివ్యూ..
ది ప్యారడైజ్ సినిమాకి సంబంధించి ఇప్పటికే సెన్సార్ పూర్తి అవ్వడం, సినీ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు ది ప్యారడైజ్ సినిమా చూడడంతో టాక్(The Paradise first review) బయటికి వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారం.. సవారీలు అనే ఒక జాతి ఉంటుంది. వాళ్లు అసలు జనాభా లెక్కల్లోనే ఉండరు, వాళ్లకు గుర్తింపు కూడా ఉండదు. కానీ కొంతమంది వీళ్లను నేరాలు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. కొంతమంది సొంతంగా నేరాలు చేస్తుంటారు.. వీళ్లను శికంజ మాలిక్ (మోహన్ బాబు) కుమారుడు (రాఘవ్ జయల్ ) చాలా క్రూరంగా దారుణంగా చూస్తూ ఉంటారు. ఈ జాతిలో నుంచి పుట్టిన వాడే జడల్ (నాని) వీటన్నిటిని పట్టించుకోకుండా జడల్ తన లైఫ్ తాను చూసుకుంటారు. కానీ తన స్నేహితుడు బిర్యాని (సంపూర్ణేష్ బాబు) తన తల్లి సంఘటనలతో జడల్ మారి సవారి జాతికి నాయకుడుగా నిలబడి మరి పోరాడడం మొదలుపెడతారు. శికంజి మాలిక్, తన కుమారుడిని , అతడి మనుషులను ఎదురు తిరిగి సవారీలు ఎలాంటి గుర్తింపు జడల్ తెస్తారు అనేది ఈ సినిమా కథ.
also read:Varanasi Mahesh Babu:వారణాసికి గుడ్ బై చెప్పేసిన మహేష్..!
4 మెయిన్ యాక్షన్ సీక్వెల్స్ హైలెట్..
ది ప్యారడైజ్ సినిమాలు 4 మెయిన్ యాక్షన్ సీక్వెల్స్ ఉంటాయట. ఆ నాలుగు కూడా హై రేంజ్ లో ఉంటాయని ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరు ఊహించని విధంగా ఉంటుందట. తల్లి సెంటిమెంట్ ఈ సినిమాకి చాలా ప్లస్ , క్లైమాక్స్ అయ్యాక బయటికి వచ్చేటప్పుడు కూడా చాలా ఎమోషనల్ బయటికి వస్తారని చెబుతున్నారు. అలాగే ఈ చిత్రంలో వయలెన్స్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయట. ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం , గర్భిణీలను వేధించడం, మహిళలను వేలంలో అమ్మేయడం వంటి సీన్స్ చాలానే ఇందులో ఉన్నాయట. ఇందులో తల్లి సెంటిమెంట్ పెట్టినప్పటికీ కుటుంబంతో కలిసి చూసే సినిమా అయితే కాదని టాక్ వినిపిస్తోంది.
also read:Aishwarya Lakshmi :డ్రెస్‌పై ట్రోలింగ్.. ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ రియాక్షన్!
క్రూరమైన గెటప్ లో మోహన్ బాబు..
ది ప్యారడైజ్ చిత్రంలో నాని జడలతో ఉన్న లుక్ కోసం చాలానే కష్టపడ్డారు. సంపూర్ణేష్ బాబుకి కూడా ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుంది. మోహన్ బాబు చాలా బ్రూతల్ గా దారుణమైన విలన్ గా కనిపించబోతున్నారు. సోనాలి కులకర్ణిని ఇందులో నానికి తల్లి పాత్రలో మెప్పించిందట. ప్యారడైజ్ సినిమా అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా ఉంటుందట.సినిమాటోగ్రఫీ విజువల్స్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. దాదాపుగా 2 గంటల 54 నిమిషాల నిడివితో ఈ సినిమా ఉంది. మరి నాని సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.




