Wednesday, September 23, 2026
HomeLATESTSivaji :పుష్ప సినిమాలో పాత్ర మిస్ చేసుకున్న నటుడు శివాజీ..!

Sivaji :పుష్ప సినిమాలో పాత్ర మిస్ చేసుకున్న నటుడు శివాజీ..!

Sivaji: పుష్ప సినిమాలో పాత్ర మిస్సయింది అంటూ శివాజీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Sivaji :స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో పుష్ప, పుష్ప 2 చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలు అటు అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలవడమే కాకుండా, జాతీయ అవార్డును కూడా అందుకునేలా చేసాయి. అయితే ఇందులో కొంతమంది నటీనటులు నటించిన క్యారెక్టర్లు ఇతర నటీనటులు నటించాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత వారు నటించలేకపోయారు. అలా నటించలేకపోయిన వారిలో టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ కూడా ఒకరు. మరి శివాజీ నటించలేకపోయిన ఆ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

పుష్ప సినిమాలో సునీల్ పాత్ర నేనే చేయాల్సింది..

తాజాగా కోర్టు సినిమా హీరో నటించిన తెల్ల కాగితం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం రోజున చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అందులో భాగంగా శివాజీ (Sivaji )మాట్లాడుతూ పుష్ప సినిమాలో కీలకమైన పాత్ర పై ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ పాత్ర రాసిపెట్టి ఉంటే వాళ్లకే దక్కుతుందని , పుష్ప చిత్రంలో సునీల్ పోషించిన రోల్ మొదట తన వద్దకే వచ్చిందని తెలిపారు శివాజీ. మనం అనుకుంటాము కానీ ఏ పాత్రకైన సరే రాసిపెట్టి ఉంటాది.. ఆ పాత్ర వారికే దక్కుతుంది.. ఆ పాత్ర ఎవ్వరికి రాదు.. మనం ఎంత అనుకున్న విధి ఒకటి రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని తెలిపారు శివాజీ.

- Advertisement -
Advertisement

also read:Kayadu Lohar: 80స్ లుక్ లో అబ్బురపరుస్తున్న కయాదు లోహర్..

చేజేతులారా గొప్ప ఛాన్స్ నేనే మిస్ చేసుకున్నాను..

అలా సునీల్ ఖాతాలోకి ఆ పాత్ర వెళ్ళిపోయింది అందుకే సునీల్ మంగళం శ్రీను గా మిమ్మల్ని అలరించారని తెలిపారు.మంగళం శ్రీను క్యారెక్టర్లో సునీల్ అద్భుతంగా నటించారని తెలిపారు. మొత్తానికి చేజేతులారా ఒక మంచి క్యారెక్టర్ ని వదిలేసుకున్నానంటూ తెలిపారు శివాజీ. అలాగే తెల్ల కాగితం సినిమా పై మాట్లాడుతూ తనకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ రాజమండ్రి నేపథ్యంలో సాగిన ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ అని, ఈ కథ వినగానే విపరీతంగా నచ్చడంతో తానే స్వయంగా నిర్మించాలని కూడా భావించినట్లు తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:The Paradise first review: నాని ది పారడైజ్ ఫస్ట్ రివ్యూ .. బొమ్మ ఎలా ఉందంటే..?

తెల్ల కాగితం మూవీ పై శివాజీ కామెంట్స్..

తెల్ల కాగితం సినిమా ఒక చిన్న టౌన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమా అని, ఇది ప్రతి ఒక్క ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుందంటూ శివాజీ తెలిపారు . ఈ సినిమా హీరో హర్ష రోషన్ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నట్లు శివాజీ తెలిపారు. ఇప్పటివరకు తెల్ల కాగితం సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా పైన అంచనాలను పెంచేసింది . ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అందరిని ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో హీరోయిన్ గా నక్షత్ర నటిస్తోంది. డైరెక్టర్ రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శివాజీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కోర్టు సినిమాలో మంగపతి పాత్ర ద్వారా మంచి పాపులారిటీ అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అఖిల్ నటించిన లెనిన్ సినిమాలో కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you