Thursday, September 24, 2026
HomeLATESTThe Paradise Movie Review:ది ప్యారడైజ్ మూవీ రివ్యూ: నాని మాస్ అవతారం ఎలా ఉంది?

The Paradise Movie Review:ది ప్యారడైజ్ మూవీ రివ్యూ: నాని మాస్ అవతారం ఎలా ఉంది?

The Paradise Movie Review:నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ మూవీ ఎలా ఉంది? పూర్తి మూవీ రివ్యూ.

on
- Advertisement -banner Ad

The Paradise Movie Review:నాని కెరీర్‌లో ‘ది ప్యారడైజ్’ మరో విభిన్నమైన ప్రయోగం. ‘దసరా’ తర్వాత మరోసారి మాస్, యాక్షన్ జానర్‌ను ఎంచుకున్న నాని.. జడల్ జమానా పాత్రలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ తర్వాత వచ్చిన ఈ కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? నాని మాస్ ప్రయోగం ఎలా ఉంది? చూద్దాం.

కథ :

1947లో ప్రారంభమయ్యే కథ 1980ల కాలంలో ముగుస్తుంది. స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్‌లోని ‘ప్యారడైజ్’(The Paradise Movie Review) ప్రాంతంలో సవారీ అనే వర్గం వివక్ష, అణచివేతను ఎదుర్కొంటుంటుంది. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే సమ్మక్క (సోనాలి కులకర్ణి) కుమారుడు జడల్ (నాని). చిన్నతనంలో జరిగిన ఓ ఘటన కారణంగా తల్లిపై, శికంజ్ మాలిక్‌పై అతనిలో కోపం పెరుగుతుంది. హత్య కేసులో జైలుకు వెళ్లిన జడల్ 14 ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు.

- Advertisement -
Advertisement

తన తల్లి పోరాటం, శికంజ్ మాలిక్‌పై ప్రతీకారం, సవారీ వర్గానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యం చుట్టూ కథ సాగుతుంది. జడల్ ప్రయాణంలో బిర్యానీ (సంపూర్ణేష్ బాబు), సుబ్బు (కయాదు లోహర్), జూనియర్ మాలిక్ (రాఘవ్ జుయల్) పాత్రలు కీలకంగా మారతాయి.

also read:Sivaji :పుష్ప సినిమాలో పాత్ర మిస్ చేసుకున్న నటుడు శివాజీ..!

- Advertisement -
Advertisement

విశ్లేషణ :

సామాజిక అణచివేత నుంచి ఒక వర్గం ఎదిగే కథ కొత్తది కాకపోయినా.. శ్రీకాంత్ ఓదెల తన ట్రీట్‌మెంట్‌తో ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు. ఆరు చాప్టర్లుగా కథను నడిపించడం ఆసక్తిని పెంచుతుంది. ప్రథమార్ధంలో ప్రపంచ నిర్మాణం, పాత్రల పరిచయం, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే ద్వితీయార్ధంలో కథనం కొంత నెమ్మదిస్తుంది. కథను ముందుకు తీసుకెళ్లే బలమైన ఎమోషన్ కొన్ని చోట్ల తగ్గిపోవడం, అవసరానికి మించిన హింస ప్రేక్షకుడికి భారంగా అనిపించవచ్చు. ఎమ్మెల్యే శంకర్ ఎపిసోడ్ మాత్రం థియేటర్లలో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.

also read:Kayadu Lohar: 80స్ లుక్ లో అబ్బురపరుస్తున్న కయాదు లోహర్..

- Advertisement -
Advertisement

నటీనటుల పర్ఫార్మెన్స్ :

జడల్ జమానా పాత్రలో నాని తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో మాస్ యాటిట్యూడ్‌ను చూపించడంతో పాటు, భావోద్వేగ సన్నివేశాల్లోనూ తనదైన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా పాత్రలోని వివిధ షేడ్స్‌ను చక్కగా ప్రదర్శించాడు. శికంజ్ మాలిక్ పాత్రలో మోహన్ బాబు గంభీరమైన నటన, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. జూనియర్ మాలిక్‌గా రాఘవ్ జుయల్ కూడా తన పాత్రకు తగ్గట్టుగా మెప్పించాడు. కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, ఈశ్వరీ రావు తమకు ఇచ్చిన పాత్రలను సమర్థవంతంగా పోషించారు. ఇక సంపూర్ణేష్ బాబు కనిపించిన తీరు, విభిన్నమైన పాత్రలో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. మొత్తంగా ప్రధాన నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా నిలిచింది.
టెక్నికల్ టీం :

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. ప్రతి సన్నివేశాన్ని రిచ్ విజువల్స్‌తో, ప్రత్యేకమైన టోన్‌లో చూపించిన విధానం మెప్పిస్తుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు కూడా కథకు తగ్గ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి మాస్ ఇంపాక్ట్‌ను తీసుకొచ్చాయి. ఎడిటింగ్ కూడా కథనానికి అనుగుణంగా సాగుతుంది. నిర్మాణ విలువలు ఎక్కడా రాజీపడకుండా కనిపిస్తాయి. అయితే కథ, స్క్రీన్‌ప్లేపై మరింత శ్రద్ధ పెట్టి, కథనంలో పట్టు పెంచి ఉంటే సినిమా ప్రభావం మరింత బలంగా ఉండేది.

ప్లస్ పాయింట్లు :

*నాని జడల్ జమానాగా మాస్ అవతార్‌లో మెప్పించిన తీరు

*శ్రీకాంత్ ఓదెల క్రియేట్ చేసిన ప్రత్యేకమైన ప్రపంచం

*సినిమాటోగ్రఫీ, రిచ్ విజువల్స్

*అనిరుధ్ రవిచందర్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

*మోహన్ బాబు, రాఘవ్ జుయల్ నటన

*ప్రథమార్ధంలోని ప్రపంచ నిర్మాణం, యాక్షన్ సన్నివేశాలు

*ఆర్ట్ డిపార్ట్‌మెంట్, నిర్మాణ విలువలు

*ఎమ్మెల్యే శంకర్ ఎపిసోడ్

మైనస్ పాయింట్లు :

*ద్వితీయార్ధంలో కథనం కొంత నెమ్మదించడం

*కొన్ని చోట్ల ఎమోషన్ బలహీనంగా అనిపించడం

*గర్భధారణ సీన్స్ చాలా దారుణంగా తీయడం

*అవసరానికి మించిన హింస

*దారుణమైన కథతో ఇంత భారీ బడ్జెట్ తీయడం.. సినిమాలో మితిమీరిన హింస

*కథ, స్క్రీన్‌ప్లేలో మరింత పట్టు ఉండాల్సింది

*కొన్ని సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్లడంలో అంతగా ప్రభావం చూపకపోవడం.

*అంతేకాకుండా ఈ సినిమా చూసిన వారందరూ.. చత్రపతి సినిమా కేజిఎఫ్ చిత్రాలు కాపీ చేసి సినిమా తీసినట్టుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పంచ్ లైన్ :

ది ప్యారడైజ్ బిర్యానీ కాదు కిచిడి..

రేటింగ్ : 1/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you