The Paradise: నేచురల్ స్టార్ నాని , డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా మొదటి ఆట నుంచి నెగటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాలో నాని మేకోవర్ నుంచి డాన్సులు, ఫైట్లు, భాష అన్ని విషయాలలో చాలా కష్టపడినప్పటికీ.. రొటీన్ కథ, చాలా ఏళ్లుగా అరగదీసిన సన్నివేశాలు ఉండడంతో వర్కౌట్ కాలేదని వినిపిస్తోంది. దీంతో నాని ది ప్యారడైజ్ సినిమా పైన సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ కూడా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ సైతం వివాదం రాజేశేలా కనిపిస్తున్నాయి.
రాజుకున్న వివాదం..
1980-85 బ్యాక్ డ్రాప్ లో సాగిన కథలో తెలంగాణ మాస్ లీడర్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావుని పోలివున్న శంకరన్న పాత్రలో నటుడు ప్రియదర్శి నటించారు. ప్రియదర్శి ఎంట్రీకి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అయితే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు పోలి ఉన్న పాత్రలో విజయ్ కుమార్ ఒక సీన్లో కనిపించారు. ఎన్టీఆర్ ఎంట్రీ కి కూడా అదే స్థాయిలో విజిల్స్ పడడం అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:Pragya Jaiswal: గ్రీన్ చుడీదార్ లో మెస్మరైజ్ చేసిన బాలయ్య హీరోయిన్!
కేసీఆర్ ను ఇన్సల్ట్ చేశారా?
కానీ శంకరన్న గెటప్ ఇప్పుడు వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తోంది. కేసీఆర్ ని పోలివున్న ముక్కు కోసం ఆయనకు వేసిన వేషం పైన కొంతమంది తీవ్రస్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. శంకరన్నకు కేసీఆర్ ముక్కుని చూపించడంతో చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం పైన ఆయన అభిమానులు కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సెన్సిబిలిటీ మ్యాటర్లో కూడా చిత్ర యూనిట్ ఎలాంటి కేర్ తీసుకోకపోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సమయం లేకపోవడం వల్ల హడావిడిగా సినిమాను రెడీ చేసి థియేటర్లోకి వదిలారంటూ పలువురు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

also read:Radhika Apte:బోల్డ్ సీన్స్ లిక్ తో నరకం అనుభవించా.. రాధిక ఆప్టే కామెంట్స్..!
మండిపడుతున్న బీఆర్ఎస్ నేతలు..
ది ప్యారడైజ్(The Paradise) చిత్రంలో శంకరన్న పాత్రకు సైతం మంచి ప్రాధాన్యత లభించింది. ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి న్యాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్ ని హీరోగా చూపిస్తూ సినిమా తెరకెక్కించారనే విధంగా కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయం తెలియకనే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సినిమాకు ప్రీమియర్ షోలు అనుమతి ఇవ్వడమే కాకుండా టికెట్ రేట్లను హైక్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్టులు వైరల్ గా చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అంతేకాకుండా 1983లో సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాలిక్ తొత్తుగా చూపించడం కూడా ఇప్పుడు కాంట్రవర్సీగా మారుతున్నది. ఇలాంటి పొలిటికల్ రిఫరెన్స్ సినిమా లపై పార్టీలు, కార్యకర్తలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి. ది ప్యారడైజ్ సినిమా ప్రారంభంలోనే ఇందులోని పాత్రలు, ప్రాంతాలు కేవలం కల్పితం మాత్రమే అంటూ చిత్ర బృందం తెలియజేశారు. కానీ శంకరన్న గెటప్ , ముఖ్యమంత్రి గత వాస్తవిక పాత్రలకు దగ్గరగా ఉండడంతో విడుదలైన రోజు ప్యారడైజ్ సినిమా పైన రచ్చ మొదలయ్యింది.




