NTR:తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన బంధం ఉందని చెప్పవచ్చు. వీరిద్దరి కాంబినేషన్ లో మొట్టమొదట వచ్చిన చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్. అప్పటినుంచి ఈ రెండు కుటుంబాలకు మంచి స్నేహబంధం ఉంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ, సింహాద్రి, RRR వంటి చిత్రాలతో మరింతగా ఆ బలం బలపడింది. అందుకే రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన ఇష్టమని చెప్పవచ్చు. తాజాగా ఫహాద్ ఫాజిల్ నటించిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు.
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్..
అయితే ఎన్టీఆర్ ఈ వేదికపై చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితం రాజమౌళి కుటుంబంతో ఉన్న బంధం పైన , డ్రాగన్ సినిమా పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్కి సర్జరీ కూడా జరిగింది. కొంత ఎనర్జీ దగ్గర.. అభిమానులను చూడగానే తనలో మళ్ళీ పాత జోష్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం తన చెయ్యి బాగానే ఉందన్న ఎన్టీఆర్ త్వరలోనే డ్రాగన్ సినిమా షూటింగ్లో పాల్గొంటాను అంటూ తెలిపారు. ఖచ్చితంగా నిర్మాతలు చెప్పిన తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని హామీని కూడా ఇచ్చారు ఎన్టీఆర్.
also read:Rithu Chowdary: డిమోన్ పవన్ – రీతూ చౌదరి బ్రేకప్..!
రాజమౌళి కుటుంబం దేవుడు ఇచ్చిన కుటుంబం..
తన సినీ ప్రయాణం ప్రారంభమైన రోజులను గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 2001లో తన మొదటి సినిమా పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు తన తల్లి రాలేదని, తండ్రి నీ కాళ్ళ మీదే నువ్వే నిలబడాలి అని చెప్పి రాలేకపోయారని , ఆ సమయంలో తన కుటుంబం నుంచి ఎవరు రాలేదని చాలా బాధపడ్డా.. అయితే ఆ బాధ చూసి దేవుడే తనకు రాజమౌళి, కీరవాణి రూపంలో మరో గొప్ప కుటుంబాన్ని ఇచ్చారేమో అంటూ తెలిపారు. అలాగే అభిమానులు తన శక్తిగా మారారని, రాజమౌళి కుటుంబం దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అని చెప్పుకొచ్చారు. తనకు సొంత తమ్ముడు ఎవరూ లేని లోటును కార్తికేయ తీర్చారని తారక్(NTR) చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.
also read:Devara 2: దేవర 2 అసలు ఉంటుందా? లేదా? క్లారిటీ ఇచ్చేది ఎవరు..?
వారణాసి గురించి అడిగి అభిమానులలో ఆసక్తి పెంచిన ఎన్టీఆర్..
చిన్నతనంలోనే తన తల్లిని నన్ను ఒక్కడినే ఎందుకు కన్నావమ్మ ఇంకో తమ్ముడు ఉంటే బాగుండేది కదా అంటూ అడిగేవాన్ని ఒకవేళ తన తమ్ముడి ఉంటే కచ్చితంగా అతను కార్తికేయ లాగే ఉండే వారేమో అంటూ తెలిపారు ఎన్టీఆర్. తన కెరియర్ లో వరుస ప్లాపులు వచ్చి తీవ్ర కష్టాలలో ఉన్న సమయంలో కూడా కార్తికేయ చాలా అండగా నిలబడ్డారు అనే విషయాన్ని గుర్తు చేశారు. ఇక రాజమౌళి తాను అంత త్వరగా ఎమోషనల్ అవ్వమని కార్తికేయతో తమకు చాలా ఎమోషనల్ బాండింగ్ ఉందంటూ తెలిపారు రాజమౌళి. అలాగే చివరిలో మహేష్ బాబుతో నటిస్తున్న వారణాసి సినిమా గురించి ఏదైనా చెప్పండి అంటూ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు మహేష్ అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
#JrNTR Emotional Words ❤️
“No one came for my first movie opening.
That day, I really felt sad. God and nature listened to it and gave me love and courage in the form of you.” pic.twitter.com/s2cUIRTlNi
— Telugu Chitraalu (@CineChitraalu) September 29, 2026




