Devara Movie: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ , డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేవర(Devara Movie). ఈ సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ ఈ సినిమాలోని పాటలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ గా మారింది. కేవలం ఈ సినిమాలో జాన్వీనీ గ్లామర్ గా చూపించడం కోసమే తీసుకున్నారనే విధంగా రూమర్స్ కూడా వినిపించాయి. దాదాపుగా ఈ సినిమా విడుదల అయి.. ఇప్పటికి రెండు సంవత్సరాలు కావస్తోంది. తాజాగా ఏఐ టెక్నాలజీతో కొంతమంది ఈ సినిమాలోని పాటపై వికృత చేష్టలకు పాల్పడడం పై సోషల్ మీడియా వేదికగా వీడియోలు వైరల్ గా మారాయి.
మార్ఫింగ్ కంటెంట్ పై ఎన్టీఆర్ ఫైర్..
ఈ విషయం పైన అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫైర్ అయ్యారు. అత్యంత దిగజారుడుతనంతో కొందరు వికృత చేష్టలకు పాల్పడుతూ మహిళలను కించపరిచేలా మార్ఫింగ్ కంటెంట్ ను సృష్టిస్తున్న వారి పైన ఫైర్ అయ్యారు. ఇలా చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు జూనియర్ ఎన్టీఆర్. ట్విట్టర్లో ఎన్టీఆర్ వాడిన పదజాలం చూస్తే ఆయన ఎంతటి ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారో అర్థం అవుతుంది.
ఎన్టీఆర్ వార్నింగ్..
అసహ్యకరం.. రోత పుట్టించే సిగ్గుమాలిన చర్య.. స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే మన నేలలో మాతృదేవోభవ అనే మాట కేవలం మాట మాత్రమే కాదు. ఇది మన సంస్కృతి లో ఒక భాగం. అలాంటి పవిత్రమైన గడ్డపై మహిళలను ఇంత దారుణంగా కించపరిచేలా ఏఐ టెక్నాలజీని కొంతమంది వాడుతూ..ఇంత నీచానికి దిగజారి పోవడం మాటల్లో చెప్పలేని సిగ్గుచేటు. ఈ మార్ఫింగ్ చేసిన చుట్టుమల్లె వీడియో వెనక ఉన్న నీచులను ఎవరిని వదిలిపెట్టను. ఈ వీడియో క్రియేట్ చేసిన వారిపైన, సర్క్యూలేట్ చేస్తూ వైరల్ చేస్తున్న వారిపైన చట్ట పరమైన చర్యలు తీసుకుంటానంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫైర్ అవుతూ ఒక ట్వీట్ చేశారు.
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where “Matrudevo Bhava” is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using…
— Jr NTR (@tarak9999) October 3, 2026
also read:Kalyani priyadarshini:అక్కడికి మకాం మార్చేసిన కళ్యాణి ప్రియదర్శిని..!
స్పందించిన జాన్వి కపూర్..
చుట్టమల్లె సాంగ్ ను ఏఐ ఉపయోగించి రూపొందించిన నకిలీ వీడియో పైన జాన్వీ కపూర్ స్పందిస్తూ ఇలాంటి నకిలీ వీడియోలు ప్రచారం అవుతుండడం కలవరపాటుకి గురి చేస్తున్నప్పటికీ.. దయచేసి అటువంటి కంటెంట్ ను ఎవరు సృష్టించవద్దు . వాటిని షేర్ చేయవద్దు. ఇది ఏఐ స్పష్టమైన దుర్వినియోగం వంటివి అంటూ, అలాంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. జై హింద్.. అంటూ జాన్వీ కపూర్ ట్విట్టర్లో షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
It’s disturbing to see AI-generated fake videos being circulated. Please don’t create, share or promote such content, This is a clear misuse of AI.
Legal action will definitely be taken against those involved.
Jai Hind 🇮🇳#JanhviKapoor
— Jahnavi Kapoor (@JanhvikapoorFC_) October 3, 2026
also read:Rachita Ram:రచితా రామ్ బుగ్గ గిల్లిన అభిమాని.. వీడియో వైరల్..!
ఫ్యాన్స్ రియాక్షన్..
ఈ విషయంపైన అటు ఇరువురు అభిమానులు కూడా సోషల్ మీడియాలో పలు రకాల ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. ఇలాంటి వికృత కంటెంట్ ను ప్రోత్సహించవద్దు అంటూ పలువురు నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. తెలుగులో కేవలం పెద్ది, దేవర వంటి సినిమాలలో నటించింది. మరి తన తదుపరి సినిమా ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.




