Monday, October 5, 2026
HomeLATESTTeja Sajja: హోస్ట్‌గా తేజ సజ్జా.. ‘ది ట్రేటర్స్’ కోసం భారీ రెమ్యునరేషన్!

Teja Sajja: హోస్ట్‌గా తేజ సజ్జా.. ‘ది ట్రేటర్స్’ కోసం భారీ రెమ్యునరేషన్!

Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయన.. హీరోగా మారిన తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు

on
- Advertisement -banner Ad

Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయన.. హీరోగా మారిన తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న తేజ సజ్జా.. ఆ తర్వాత ‘మిరాయ్’తోనూ తన మార్క్ చూపించాడు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు ఓటీటీ రంగంలోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

‘ది ట్రేటర్స్’ హోస్ట్‌గా తేజ సజ్జా :

అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో స్ట్రీమింగ్ కానున్న ప్రముఖ రియాలిటీ షో ‘ది ట్రేటర్స్’ తెలుగు వెర్షన్‌కు తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. దీంతో తొలిసారి హోస్ట్‌గా బుల్లితెర, ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తేజ సిద్ధమవుతున్నాడు. అంతర్జాతీయంగా మంచి ఆదరణ పొందిన ఈ రియాలిటీ ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రూపొందిస్తున్నారు.

- Advertisement -
Advertisement

నమ్మకం, మోసం, వ్యూహాలు, మైండ్ గేమ్స్ చుట్టూ సాగే ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య జరిగే పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. ఎవరు ఎవరిని నమ్మాలి? ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరి వ్యూహం చివరి వరకు నిలుస్తుంది? అనే అంశాలు షోకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

హోస్టింగ్‌కు భారీ రెమ్యునరేషన్? :

‘ది ట్రేటర్స్’ హోస్ట్‌గా వ్యవహరించేందుకు తేజ సజ్జాకు మేకర్స్ భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్‌కు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఈ షో కోసం చెల్లిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రూ.2 కోట్లకు పైగానే తేజకు రెమ్యునరేషన్ అందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ప్రైమ్ వీడియో లేదా తేజ సజ్జా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

20 మంది సెలబ్రిటీలు.. 10 ఎపిసోడ్లు :

తెలుగు వెర్షన్ ‘ది ట్రేటర్స్’లో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో పాటు సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొననున్నట్లు సమాచారం. మొత్తం 20 మంది కంటెస్టెంట్లతో ఈ షోను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు వారాల పాటు 10 ఎపిసోడ్లుగా షో కొనసాగనుంది. అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుండగా.. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

హోస్ట్‌గా ఎలా మెప్పిస్తాడో?:

ఇప్పటికే నాగార్జున, ఎన్టీఆర్, నాని, రానా వంటి స్టార్ హీరోలు వివిధ టీవీ, ఓటీటీ షోలకు హోస్టులుగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ జాబితాలో తేజ సజ్జా కూడా చేరుతున్నాడు. ‘హనుమాన్’తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్, యూత్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రైమ్ వీడియో అతడిని హోస్ట్‌గా ఎంపిక చేసినట్లు టాక్. మరి నటుడిగా మెప్పించిన తేజ సజ్జా.. హోస్ట్‌గా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి…?

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you