Thursday, October 8, 2026
HomeLATESTAllu Arjun: మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..?

Allu Arjun: మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..?

Allu Arjun: అల్లు అర్జున్ అభిమానులు మహారాష్ట్రలో చేసిన పనికి సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

on
- Advertisement -banner Ad

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రాబోతున్న రాకా చిత్రానికి కూడా భారీగానే హైప్ ఏర్పడింది. అల్లు అర్జున్ క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలలో కూడా అభిమాన సంఘాలు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మహారాష్ట్రలో ఇప్పుడు తాజాగా మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో గొప్ప పని చేస్తున్న అల్లు అర్జున్ అభిమానులు..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర కమిటీ గురించి అధికారికంగా ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో పలు రకాల కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతున్నాయని , రాష్ట్ర కమిటీతో పాటు పరభణి, ముంబై, పుణె, నాందేడ్, హింగోలి, ఉమ్రి, సోలాపూర్, షిరిడి తదితర ప్రాంతాలతో పాటు మొత్తం పది జిల్లాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా AAFA అసోసియేషన్ ఆధ్వర్యంలో HPV పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. HPV వ్యాక్సిన్ పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వాటిని నిర్లక్ష్యం చేయవద్దు అనే కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీంతో మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నెట్వర్క్ మరింతగా చేయడమే కాకుండా అభిమానులు సేవా కార్యక్రమాలలో కూడా భాగం కావడం గమనార్హం.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi :చిరంజీవి కోసం అదిరిపోయే కథ.. ఆ సెన్సేషనల్ డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ?

అభిమానులంతా ఒకే తాటిపైకి..

ఇప్పటికే వ్యక్తిగతంగా అటు స్థానిక స్థాయిలో కూడా అల్లు అర్జున్ అభిమానులు పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాల పైన అభిమానులను ఒకే వేదిక పైన తీసుకురావడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల కార్యక్రమాలను కూడా మరింత బలపరిచేందుకు ఈ కమిటీలు మరింత ఉపయోగపడతాయని సంఘంలోని కీలకమైన సభ్యులు వెల్లడించారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ అభిమానులు కూడా హాజరయ్యారు. ఈ విషయం అటు అల్లు అర్జున్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Tollywood:టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ప్రేమ పక్షులు.. జోడి సూపర్..!

అల్లు అర్జున్ సినిమాలు..

అల్లు అర్జున్ (Allu Arjun)ప్రస్తుత చిత్రాల విషయానికే వస్తే.. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా చిత్రంలో నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిస్తుండగా .. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. సన్ పిక్చర్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక మిగిలిన నటీనటుల గురించి అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు కానీ ఇప్పటివరకు విడుదలైన అప్డేట్లు మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమాని చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you