Bandla Ganesh:టాలీవుడ్లో నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఆయన చేసే పోస్టులు, వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. అయితే గత కొంతకాలంగా బండ్ల గణేష్ పేరుతో రాజకీయ, సినీ పరిశ్రమకు సంబంధించిన పలు రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ప్రమేయం లేకుండా జరుగుతున్న ఈ ప్రచారంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజాగా ఓ బహిరంగ లేఖను విడుదల చేసి, తన పేరును అనవసర వివాదాల్లోకి లాగొద్దని స్పష్టం చేశారు.
పదవులు, హోదాలపై ఆసక్తి లేదు :
తనకు ఎలాంటి పదవులు, హోదాలు లేదా అధికారాలపై మక్కువ లేదని బండ్ల గణేష్ లేఖలో పేర్కొన్నారు. ప్రజలు ఇన్నేళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానం ద్వారా వచ్చిన గౌరవమే తనకు ఎంతో విలువైనదని తెలిపారు. తన గురించి ప్రత్యేకంగా కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని, తనను దగ్గరగా చూసిన వారికి తన ఆలోచనలు, ప్రయాణం, వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలుసని అన్నారు.
also read:Nana Patekar:సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత!
నా ప్రమేయం లేని విషయాల్లో పేరు వాడొద్దు :
తనకు సంబంధం లేని విషయాలను తన పేరుతో ముడిపెట్టవద్దని బండ్ల గణేష్ (Bandla Ganesh)కోరారు. తాను చెప్పని మాటలను తన వ్యాఖ్యలుగా, తాను చేయని పనులను తన చర్యలుగా ప్రచారం చేయడం సరికాదని స్పష్టం చేశారు. రూమర్లు, గాలి వార్తలకు తాను స్పందించకుండా ఉండటాన్ని తన సంయమనంగా మాత్రమే చూడాలని సూచించారు. తన పేరును అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంచాలని ఆయన కోరారు.
also read:Allu Arjun: మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..?
రాజకీయాలకు నా పేరును ఉపయోగించొద్దు :
లేఖ చివర్లో బండ్ల గణేష్ తనదైన శైలిలో ఘాటైన సందేశాన్ని ఇచ్చారు. తన పేరును రాజకీయాలకు ఉపయోగించవద్దని, తనను అడ్డుపెట్టుకుని ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించొద్దని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావిస్తూ ప్రచారం చేయడం సరికాదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఇటీవల చోటుచేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాలు, సినీ పరిశ్రమకు సంబంధించిన చర్చల్లో బండ్ల గణేష్ పేరు పదేపదే వినిపిస్తున్న నేపథ్యంలోనే ఆయన ఈ బహిరంగ లేఖ ద్వారా స్పందించినట్లు సమాచారం. తనపై వస్తున్న రకరకాల ప్రచారాలు, ఊహాగానాలకు చెక్ పెట్టేందుకే ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బండ్ల గణేష్ విడుదల చేసిన ఈ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ లేఖతో తనపై జరుగుతున్న రాజకీయ, సినీ ప్రచారాలకు ఇకనైనా తెరపడుతుందా? లేదా మరింత చర్చకు దారితీస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Producer @ganeshbandla issues a clarification, requesting everyone not to link his name with unnecessary controversies or political matters.
#BandlaGanesh https://t.co/tU2xMWyHJ7
— Sai Satish (@PROSaiSatish) October 7, 2026




