Saturday, October 24, 2026
HomeLATESTPriya Vadana :కరుప్పు మూవీ నటి ప్రియవదన ఆత్మహత్య..!

Priya Vadana :కరుప్పు మూవీ నటి ప్రియవదన ఆత్మహత్య..!

Priya vadana: కరుప్పు మూవీలో చిన్న పాత్రతో ఆడియన్స్ను ఆకట్టుకున్న ప్రియ వదన 24 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది.

on
- Advertisement -banner Ad

Priya Vadana :కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త సంచలనంగా మారింది. బుల్లితెర న్యూస్ ప్రెసెంటర్ గా పేరు సంపాదించుకున్న యువనటి ప్రియవదన ఆత్మహత్య. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఈమె బలవస్మరణానికి పాల్పడడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని చెన్నై ప్రెస్ క్లబ్ అధికారికంగా వెల్లడించడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. జర్నలిస్టు రంగం పైన మక్కువ ఉండడంతో టెలివిజన్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియవదన మొదట వెందర్ టీవీలో న్యూస్ రీడర్గా పనిచేసింది. ఆ తర్వాత తంతి టీవీ వార్తా చానల్లో ప్రెసెంటర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్న నటి..

తనదైన శైలిలో వార్తలను చదువుతూ.. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియ మీడియా రంగంలో స్థిరపడుతున్న సమయాల్లో నటన వైపు ఆసక్తి పెరగడంతో సినిమాల వైపు నడవడం జరిగింది. అలా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు చిత్రంలో ఒక కీలకమైన పాత్ర పోషించడం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియవదన(Priya Vadana). వెండితెర పైన మొదటి సినిమాతోనే మంచి నటనతో ఆకట్టుకున్న ఈమె భవిష్యత్తు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని అభిమానులు భావించారు. అలా జర్నలిజాన్ని , సినిమాను రెండింటినీ సమన్వయం చేసుకుంటూ కెరియర్లో స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది .

- Advertisement -
Advertisement

also read:Immortal movie OTT:కయాదు లోహర్ హర్రర్ మూవీ ఓటీటిలోకి ఎప్పుడంటే..?

కెరియర్ తొలినాళ్లలోనే కఠిన నిర్ణయం..

డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రియ వదన చాలా చురుకుగా పాల్గొనేవారు. నిత్యం సరికొత్త ఫోటోషూట్లు, తన వ్యక్తిగత ఆలోచనలను పంచుకునేవారు. గడిచిన కొద్ది రోజుల క్రితం ఆమె తన 24వ పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా జరుపుకున్నట్లు ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. కోయంబత్తూరు నగరంలో దళపతి విజయ్ ప్రారంభించిన పెరియార్ సైన్సు సెంటర్ గొప్పతనాన్ని కూడా ఆమె వివరిస్తూ ఇటీవల ఒక పోస్టును కూడా చేయడం బాగా ఆకట్టుకుంది. అలా జీవితంపై ఎంతో ఉత్సాహం ప్రదర్శించిన ఈ నటి ఇంతలోనే తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం ఎవరు ఊహించలేకపోయారు.

- Advertisement -
Advertisement

also read:Fauzi:ఫౌజీ సినిమా గ్లింప్స్ వైరల్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రభాస్..!

ఆత్మహత్యకు గల కారణం?

చెన్నై ప్రెస్ క్లబ్ ప్రియవదన మృతిని ధ్రువీకరిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు, తోటి జర్నలిస్టులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. కెరియర్ ఎదుగుతున్న సమయంలో ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది ప్రియ అనే అంశం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. మరి వ్యక్తిగత కారణాలా లేకపోతే ఏదైనా ఒత్తిడా అనే కోణంలో ఇంకా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న వయసులోనే ప్రియ మరణ వార్త అటు బాలీవుడ్ వర్గాలను , అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. నటి ప్రియా ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం కోలీవుడ్ పరిశ్రమలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది..

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you