Tuesday, November 3, 2026
HomeINTERVIEWSRadhika Apte:బాలయ్య సినిమాపై రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..!

Radhika Apte:బాలయ్య సినిమాపై రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..!

Radhika Apte: రాధిక ఆప్టే తాజాగా తన వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా చేసిన కామెంట్లతో బాలయ్య అభిమానులు ఈమెపై మండిపడుతున్నారు.

on
- Advertisement -banner Ad

Radhika Apte:తన అందం, అభినయంతో బోల్డ్ పాత్రలలో జాతీయస్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. తెలుగులో కేవలం మూడు నాలుగు సినిమాలలో నటించిన రాధిక ఆప్టే తనదైన శైలిలో ప్రేక్షకులను సంపాదించుకుంది. ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలు పోషించే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో పనిచేసిన అనుభవాల పైన నిరంతరం సోషల్ మీడియాలో ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సినిమా కథల పైన, ఇక్కడ సంస్కృతి పైన కూడా రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు మరొకసారి తీవ్ర చర్చనీయంశంగా మారుతున్నాయి.

ఇన్ డైరెక్ట్ గా బాలయ్య మూవీ పై కామెంట్..

ఇటీవలే మహానటి కీర్తిసురేష్ తో కలిసి రాధిక ఆప్టే నటించిన క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్కా. ప్రస్తుతం ఓటీటి లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. వెబ్ సిరీస్ లో భాగంగా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు గత సినిమా అనుభవాలను తెలియజేస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రాధిక ఆప్టే. ముఖ్యంగా తెలుగులో నేను చేసిన ఒక చిత్రంలో నాకంటే వయసులో పెద్దవారైనా నటుడుతో రొమాన్స్ చేయవలసి వచ్చిందని, అంతేకాకుండా కథలో సొంత మేనబావను పెళ్లి చేసుకునే సీన్స్ కూడా ఉన్నాయని,పైగా సినిమా మధ్యలోనే నా పాత్రను చంపేస్తారని చెప్పుకొచ్చింది.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi:అమిత్ షాను కలిసిన చిరంజీవి-రామ్ చరణ్.. ఎందుకంటే..?

నెటిజెన్స్ మండిపాటు..

అయితే రాధిక ఆప్టే ఏ సినిమా పేరుని కూడా నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ అది నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సినిమా అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు .ఆ సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రాధిక ఆప్టే బాలయ్యకి మరదలు పాత్రలో నటించింది.. లెజెండ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో ఈమె పాత్ర ఉంటుంది విలన్ చేతిలో రాధిక ఆప్టే మరణిస్తుంది. ప్రస్తుతం రాధిక ఆప్టే(Radhika Apte) చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె పైన తీవ్రస్థాయిలో బాలయ్య అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Srinidhi Shetty:సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీనిధి శెట్టి బికినీ వీడియో..!

స్టోరీ వినకుండానే సంతకం చేసావా?

కథ నచ్చకపోతే పెద్ద హీరోతో నటించడం ఇష్టం లేకపోతే అసలు సినిమాకి ఒప్పుకోవడం ఎందుకు అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. స్టోరీ వినకుండా, హీరో ఎవరో తెలియకుండానే సినిమా అగ్రిమెంట్ మీద సంతకం చేస్తారా? అంటూ పలువురు బాలయ్య అభిమానులే కాకుండా నెటిజన్స్ సైతం రాధిక ఆప్టేను నిలదీస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో మేనరికం, పెళ్లిళ్లు ఎన్నో తరాలుగా వస్తూ ఉన్నాయని వాటిని కథలో చూపించడం కూడా సహజమే అంటూ గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బాలయ్యతో లెజెండ్ తర్వాత మళ్లీ ఆమె లయన్ సినిమాలో కూడా నటించింది అంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది రాధిక ఆప్టేకు సపోర్టుగా నిలుస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you