Sai Dharam Tej:టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అభిమానుల్లో ఆసక్తి మొదలవుతుంది. ముఖ్యంగా మెగా హీరోల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (సాయి దుర్గా తేజ్) పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. అంతేకాదు, నిశ్చితార్థం, పెళ్లి తేదీలకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నవంబర్ 5న నిశ్చితార్థం? :
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ (సాయి దుర్గా తేజ్)(Sai Dharam Tej) నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్ 5, 2026న హైదరాబాద్‌లో సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరుకానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా ప్రైవేట్‌గా ఈ వేడుకను నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లు, తేదీ, ఇతర వివరాలపై ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
also read:Tabu:నాగార్జున 100వ సినిమాలో బిగ్ సర్‌ప్రైజ్.. టబు ఎంట్రీతో అంచనాలు డబుల్!
డిసెంబర్ 10న పెళ్లి అంటూ ప్రచారం :
నిశ్చితార్థంతో పాటు సాయి ధరమ్ తేజ్ వివాహానికి సంబంధించిన వార్తలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. డిసెంబర్ 10, 2026న ఆయన వివాహం జరగనుందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి నెలకొనడం ఖాయం. అయితే వివాహ వేదిక, ఇతర వేడుకలకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
also read:Jyothi Rai:సుకు పూర్వాజ్ ని దాని కోసం పెళ్లి చేసుకోలేదు.. జ్యోతి రాయ్ సెన్సేషనల్ కామెంట్స్!
కాబోయే భార్య కిరణ్మయి అంటూ టాక్! :
ఇక సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయంపై కూడా నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన తన స్నేహితురాలు కిరణ్మయి ని వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం వినిపిస్తోంది. ఆమె ఆయనతో పాటు చదువుకున్న అమ్మాయి అని..వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని..ఆ తరువాత ప్రేమిచుకున్నారు అని..ఇప్పుడు పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా మారబోతున్నారని టాక్.
మెగా అభిమానుల్లో ఆసక్తి :
వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి ధరమ్ తేజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే నిశ్చితార్థం, వివాహ తేదీలు, కాబోయే భార్య వివరాలపై హీరోగానీ, మెగా కుటుంబ సభ్యులుగానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో ప్రస్తుతం ఇవన్నీ ప్రచారంలో ఉన్న వార్తలుగానే చూడాలి. సాయి దుర్గా తేజ్ స్వయంగా స్పందిస్తేనే ఈ పెళ్లి వార్తలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




