Tuesday, November 3, 2026
HomeLATESTBigg Boss 10:బిగ్ బాస్ హౌస్ లో భారీ ట్విస్ట్.. రోహిత్ రీ ఎంట్రీ..?

Bigg Boss 10:బిగ్ బాస్ హౌస్ లో భారీ ట్విస్ట్.. రోహిత్ రీ ఎంట్రీ..?

Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ టెన్ లో ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయిన రోహిత్ ను మళ్లీ తీసుకొస్తున్నారు అనే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Bigg Boss 10:గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిత్ నాయుడు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగు పదవ సీజన్లో తనదైన ఆట, మాట తీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించిన రోహిత్ అనూహ్యంగా ఎలిమినేట్ కావడంతో ఆయన అభిమానులు, సగటు బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కొంతమంది ఏకంగా రోహిత్ ఉంటేనే బిగ్ బాస్ షో ఇంట్రెస్ట్ గా ఉండేదని, అతను లేకుంటే బోరింగ్ గా మారిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రోహిత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా?

అలాగే రోహిత్ ని వెంటనే తిరిగి బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 10)లోకి తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు తాజాగా రోహిత్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. 24X 7 స్ట్రీమింగ్ లో భాగంగా జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ కళ్ళకు గంతలు కట్టి మరి తీసుకురాబోతున్నట్లుగా చూపించినట్లు ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో లో రోహిత్ రీ ఎంట్రీ తో అటు సుధీర్ తో పాటుగా హౌస్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ కూడా షాక్ అయినట్లు మనం చూడవచ్చు.

- Advertisement -
Advertisement

also read:Kamakshi Bhaskarla:కమిట్‌మెంట్ పేరుతో అలా అడుగుతారట.. నటి కామాక్షి బోల్డ్ కామెంట్స్!

లీక్ అయిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్.

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం రోహిత్ కు కళ్ళకు గంతలు కట్టుకొని మరి హౌస్ లో ఎంట్రీ ఇస్తున్న వీడియో వైరల్ గా మారింది. సాధారణంగా ఏ కంటెస్టెంట్ అయినా సరే ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లోకి తీసుకోవడం జరగదు. సాధారణంగా ఏ కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లో అతని జర్నీని ఒక వీడియో రూపంలో చూపిస్తారు. కానీ రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం అలాంటివి చూపించలేదు.దీంతో ఈ విషయాలను రోహిత్ ఫ్యాన్స్ కూడా మరింత వైరల్ గా చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Sai Dharam Tej:మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై బిగ్ అప్‌డేట్!

ఎలిమినేట్ తర్వాత రోహిత్ క్యూట్ పోస్ట్..

దీన్నిబట్టి చూస్తే ఖచ్చితంగా వస్తారని, అందుకే ఎలిమినేషన్ అయ్యాక అతని ఏవీ చూపించలేదని గట్టిగానే నమ్ముతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో రోహిత్ రీఎంట్రీ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. రోహిత్ ఎలిమినేషన్ తర్వాత కూడా ఇంటికి వెళ్లి తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడం గమనార్హం. మేనల్లుడిని చేతిలోకి ఆప్యాయంగా తీసుకొని మరి మురిసిపోతూ ఉన్న ఒక ఫోటోని షేర్ చేశారు. చాలా రోజుల తర్వాత తన మేనల్లుడుతో ఉన్నానంటూ ఒక క్యాప్షన్ కూడా తెలిపారు. అలాగే మరొక పోస్ట్ కూడా పెడుతూ ముఖ్యంగా ఎలిమినేషన్ పైన తీవ్ర నిరాశని తెలియజేస్తూ ఒక ఆసక్తికరమైన వీడియోను కూడా పంచుకున్నారు రోహిత్. మరి రోహిత్ ఎలిమినేషన్ నిజంగానే ఉంటుందా లేదా అనే విషయం చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you