Pooja Hegde:సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల అందం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్, నవ్వు, ముఖ కవళికలకు అభిమానులు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే తెరపై ఎంతో అందంగా కనిపించే నటీమణులు సైతం తమ రూపం విషయంలో కొన్నిసార్లు అసంతృప్తికి గురవుతుంటారు. అలాంటి అనుభవాలనే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పంచుకున్నారు. చిన్నతనంలో తన ముఖంలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు తనకు నచ్చేవి కావని, వాటి గురించి బాధపడేదానినని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.
చిన్నతనంలో నా రూపం నాకే నచ్చేది కాదు:
తాజాగా ఓ బ్రాడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న పూజా హెగ్డే(Pooja Hegde) తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్న వయసులో ఉన్నప్పుడు తన రూపం గురించి ఎన్నో రకాలుగా ఆలోచించేదానినని తెలిపారు. ముఖ్యంగా తన ముక్కు, నవ్వు తనకు అస్సలు నచ్చేవి కావని చెప్పారు. అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నప్పుడు కొన్ని లక్షణాల విషయంలో అసంతృప్తిగా అనిపించేదని, వాటి గురించి ఆలోచిస్తూ బాధపడేదానినని వెల్లడించారు.
also read:Abhinaya Sri:పెళ్లి విషయంలో అభినయ శ్రీ కండిషన్స్ ఇవే.. అందుకే ఇంకా సింగిలా?
నాన్న చెప్పిన ఒక్క మాటతో మారిన ఆలోచన:
తన రూపం గురించి చిన్నతనంలో ఎంతగా బాధపడేదానినో ఒక సందర్భంలో తండ్రితో కూడా పంచుకున్నానని పూజా హెగ్డే తెలిపారు. అప్పుడు తన తండ్రి చెప్పిన సమాధానం తన ఆలోచనా విధానాన్నే మార్చేసిందని గుర్తుచేసుకున్నారు. దేవుడు మన ముఖానికి ఏ ముక్కు సరిపోతుందో ఆలోచించే ఇచ్చాడని, ఒకవేళ తన ముఖానికి పెద్ద ముక్కు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని తండ్రి చెప్పినట్లు వివరించారు.
ఆ మాటలు తనకు ఎంతో అర్థవంతంగా అనిపించాయని, అప్పటి నుంచి తన ముఖంలోని ప్రత్యేకతలను మరో కోణంలో చూడటం ప్రారంభించానని చెప్పారు. మనలో ఉన్న లోపాలుగా భావించే అంశాలు కూడా మన వ్యక్తిత్వంలో భాగమేననే విషయాన్ని అర్థం చేసుకున్నానని తెలిపారు.
also read:Silk Smitha:తెర వెనుక సిల్క్ స్మిత అసలు మనిషి ఇదే.. ప్రేమ్ సాగర్ షాకింగ్ కామెంట్స్!
మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం:
అలాగే మన గురించి మనం ఆలోచించేటప్పుడు చాలామంది అవసరానికి మించి నెగిటివ్‌గా స్పందిస్తుంటారని పూజా అభిప్రాయపడ్డారు. మనలో ఏదో ఒకటి బాగోలేదని భావిస్తూ మనల్ని మనమే తక్కువ చేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఒకప్పుడు తనకు నచ్చని ముక్కు, నవ్వునే ఇప్పుడు ప్రేక్షకులు ఎంతో ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు.
అందుకే ఇతరులతో పోల్చుకోవడం, మన రూపాన్ని విమర్శించుకోవడం మానేసి మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకమైన అందం ఉంటుందని, దాన్ని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆమె మాటల సారాంశం.
ప్రస్తుతం పూజా హెగ్డే చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అందం అంటే కేవలం ముఖ కవళికలు మాత్రమే కాదని, మనపై మనకున్న నమ్మకం కూడా ముఖ్యమని ఆమె చెప్పిన విషయాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి.




