Priyanka Chopra:బాలీవుడ్, హాలీవుడ్లో గ్లోబల్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ప్రియాంక చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. వివాహమైన తర్వాత అమెరికాలో సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నా.. కొన్ని కారణాల చేత వాటిలో నటించలేదు. కేవలం తన దృష్టి మొత్తం హాలీవుడ్ ప్రాజెక్టులపైనే పెట్టింది. 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్ చిత్రం తర్వాత మరో ఇండియన్ సినిమాలో కూడా నటించలేదు.
నిర్మాతగా ప్రియాంక చోప్రా కొత్త మూవీ..
అయితే డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ చిత్రం వారణాసి. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడిగా నటించింది. ఇందులో ఈమె పాత్ర మందాకిని అనే ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించబోతోంది. నటిగా మొట్టమొదటిసారి సంతకం చేసిన భారతీయ సినిమా కావడం కూడా అభిమానులలో మరింత అంచనాలను పెంచేస్తోంది వారణాసి సినిమా. మరొకవైపు ప్రియాంక చోప్రా (Priyanka Chopra)కేవలం నటిగానే కాకుండా తన నిర్మాణ సంస్థ పర్పుల్ టేబుల్ పిక్చర్ ద్వారా కొన్ని సినిమాలను నిర్మిస్తూ ఉన్నది.
also read:Dhanush:సాయి పల్లవికి సపోర్టుగా ధనుష్!
ఆ చిత్రానికి సీక్వెల్..
2016లో జాతీయ అవార్డుతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న మరాఠీ చిత్రం వెంటిలేటర్ కి సీక్వెల్ గా వెంటిలేటర్ 2 చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ రాజేష్ మాపుష్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రియాంక చోప్రాతో పాటుగా ఆమె తల్లి మధు చోప్రా, రాజేష్ కలిసి జాయింట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో కేవలం నిర్మాత మాత్రమే బాధ్యతలు తీసుకుందని, ఈ సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో కనిపించడం లేదంటూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.
also read:Anupama parameswaran: దీపావళి వేళ ఎరుపు చీరలో ఆకట్టుకున్న అనుపమ.. ఫొటోస్ వైరల్!
వారణాసి చిత్రంతో ఆడియన్స్ ముందుకు..
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కంటెంట్ డ్రివెన్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తోంది ప్రియాంక చోప్రా. 2027 లో ఈ వెంటిలేటర్ 2 చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వారణాసి వంటి వండర్ఫుల్ సినిమాలో నటించడంతోపాటుగా ఇలాంటి ఫ్రాంచైజీని నిర్మించడం ద్వారా అటు ప్రియాంక చోప్రా నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తనదైన ముద్ర సంపాదించుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి వారణాసి సినిమా వల్ల ప్రియాంక చోప్రా పేరు ఈమధ్య తరచూ ఎక్కువగా వినిపిస్తోంది. వారణాసి సినిమా వివిధ ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్నట్లు తెలుస్తోంది.. ఈ చిత్రం గ్లోబల్ అడ్వెంచర్ ఫిలిం హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సుమారుగా పలు రకాల భాషలలో వారణాసి సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. 2027 ఏప్రిల్ ఏడవ తేదీన వారణాసి సినిమా రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమాతో ప్రియాంక చోప్రా ఎలాంటి పేరు సంపాదించుకుంటుందో చూడాలి.




