Monday, November 9, 2026
HomeLATESTRajamouli:వారణాసి సినిమా కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్..!

Rajamouli:వారణాసి సినిమా కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్..!

Rajamouli: రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా కోసం మాస్టర్ ప్లాన్ వేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Rajamouli:రాజమౌళి దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి పాన్ వరల్డ్ చిత్రం వారణాసి. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అయితే అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే చాలా భాషలలో ఈ సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విఎఫ్ ఎక్స్ , ఇతర సాంకేతికలను ప్రపంచస్థాయిలో ఉండేలా జోడిస్తున్నట్లు వినిపిస్తున్నాయి.

వారణాసి హక్కుల కోసం దిగ్గజ సంస్థల మధ్య పోటీ..

అలాగే వీటితో పాటు సినిమా పంపిన ఇతర మార్కెటింగ్ విషయాల పైన కూడా పలు రకాల ప్రక్రియలు మొదలయ్యాయని వినిపిస్తున్నాయి. ప్రపంచ సినిమా పరిశ్రమలోనే ఒక దిగ్గజ సంస్థ వారణాసి సినిమా విడుదల హక్కులు కొనుగోలు చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారణాసి సినిమా కోసం భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు కూడా ఎంత ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. రాజమౌళి(Rajamouli) బాహుబలి సిరీస్ తర్వాత RRR సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు వారణాసి సినిమా కూడా అంతకుమించి ఆడుతుందని సినీ విశ్లేషకులు కూడా తెలుపుతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Priyanka Chopra:నిర్మాతగా ప్రియాంక చోప్రా ఏ సినిమా తెరకెక్కిస్తోందో తెలుసా..?

రంగంలోకి సోనీ..

ఇటువంటి నేపథ్యంలోనే వారణాసి సినిమా హక్కుల కోసం పెద్ద పెద్ద కంపెనీలు కూడా క్యూలో ఉన్నాయట. ముఖ్యంగా వీటిలో సోనీ కంపెనీ కూడా ఉండడం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ పంపిణీ మరియు ఆడియో సంస్థలలో ఒకటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు వారణాసి సినిమాని విదేశీ విడుదల హక్కులను కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల సోనీ సంస్థ రామాయణం అనే భారతీయ చిత్రాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల చేసింది. ఇండియా తో సహా 50 వేల స్క్రీన్ లలో ఈ సినిమాను విడుదల చేయగా ఇందుకు ప్రధాన కారణం సోని పంపిణీ సంస్థే అని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

also read:Dhanush:సాయి పల్లవికి సపోర్టుగా ధనుష్!

వారణాసిపై పెరుగుతున్న అంచనాలు..

ఇప్పుడు వారణాసి చిత్రాన్ని కూడా సోనీ సంస్థ పంపిణీ చేయాలని నిర్ణయించుకుందని , దీనిపైన ఇప్పటికే చిత్ర బృందంతో నిర్మాతలతో మాట్లాడారని.. ఒకవేళ సోనీ సంస్థ వారణాసి చిత్రాన్ని పంపిణీ చేస్తే ఇండియాలోనే మరే ఇతర సినిమాకు లేనివిధంగా భారీ స్థాయిలో విడుదల చేసేలా ఉంటుందట. వారణాసి సినిమా భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. వారణాసి చిత్రం భారతదేశం, యూరప్ , ఆఫ్రికా వంటి ప్రదేశాలలో చిత్రీకరించారు. ఇందులో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. రాబోయే రోజుల్లో వరుస అప్డేట్లతో ఈ సినిమా పైన అంచనాలను పెంచేలా చిత్ర బృందం ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తోంది. రాజమౌళి కెరియర్ లోని అతిపెద్ద యాక్షన్ సినిమాగా భారీ బడ్జెట్ సినిమాగా పేరు సంపాదించింది. 2027 ఏప్రిల్ ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you