Wednesday, November 11, 2026
HomeINTERVIEWSkiyara advani:బోల్డ్ సీన్స్ పై ట్రోల్ .. కియారా షాకింగ్ కామెంట్స్!

kiyara advani:బోల్డ్ సీన్స్ పై ట్రోల్ .. కియారా షాకింగ్ కామెంట్స్!

kiyara advani:ప్రముఖ హీరోయిన్ కియారా అద్వాని టాక్సిక్ సినిమాలో తన సన్నివేశాలపై వచ్చిన కామెంట్లకు కరణ్ షోలో స్పందించింది.

on
- Advertisement -banner Ad

kiyara advani:సినీ సెలబ్రిటీలు అంటే నిరంతరం వారి గురించి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో వారు నటించిన పాత్రలు కూడా వారిని ట్రోల్ అయ్యేలా చేస్తూ ఉంటాయి. నిజ జీవితానికి వెండితెర పైన కనిపించే వ్యక్తిత్వాన్ని వేరువేరుగా చూడడమే ఇందుకు ముఖ్య కారణం అని కూడా చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా పెరగడంతో రొమాంటిక్ సీన్స్ లలో మహిళా నటీమణులు నటిస్తే చాలు వారి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తే చాలా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

కియారా పై ట్రోల్స్.. స్పందించిన సిద్ధార్థ్..

అలా ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం టాక్సిక్. ఈ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాని నటించింది. అయితే ఇందులో కియారా అద్వానీ (kiyara advani)నటించిన సీన్స్ పైన చాలామంది ట్రోల్ చేశారు. ఈ వివాదంపై ఆమె భర్త, ప్రముఖ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా తాజాగా స్పందించిన తీరు ఆమెకు ఇచ్చిన ధైర్యం ఒక కొత్త చర్చకు దారితీసింది.

- Advertisement -
Advertisement

భర్తను లాగడంపై స్పందించిన కియారా..

యశ్ టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ బోల్డ్ సీన్స్ లో నటించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ తీవ్రదుమారాన్ని రేపాయి .ఈ సినిమాలో తన పైన ఉన్న ఇంటిమేట్ సీన్లను తొలగించాలంటూ ఆమె దర్శకురాలిని కోరినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ రూమర్స్ ను కియారా తీవ్రంగా ఖండించింది. తాను ఎప్పుడూ కూడా అలాంటి విన్నపం చేయలేదని, అవన్నీ కేవలం రూమర్సే అంటూ తేల్చి చెప్పింది. వివాహమైన తర్వాత తెరపైన బోల్డ్ సీన్లు నటించడాన్ని తప్పుపడుతూ కియారా ను ట్రోల్ చేయడమే కాకుండా ఆమె భర్త సిద్ధార్థ్ ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారు.

also read:Srinidhi Shetty: అందాల సోయగాలతో మైమరపిస్తున్న శ్రీనిధి శెట్టి!

- Advertisement -
Advertisement

తన భర్త అండగా నిలిచార అంటూ..

ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఈ జంట.. టాక్సిక్ సినిమా వివాదం పైన స్పందిస్తూ చూసి తాను ఆందోళనకు గురైనప్పుడు తన భర్త తనకు ధైర్యాన్ని ఇచ్చారని తెలియజేసింది. నీపై విమర్శలు చేసే వ్యక్తులు నీకు తెలియదు. వారిని నువ్వు ఎప్పుడు చూడనే లేదు. మన వివాహం నచ్చని కొంతమంది ఫ్యాన్స్ చేసే అనవసరపు రచ్చేయిదని ఇలాంటివి చూసి ఇంట్లో కూర్చొని ఏడవడం సరికాదు. కాలక్రమేనా మారుతూ ఉండాలి. వారి కోసం మీ మానసిక ప్రశాంతతను ఎందుకు కోల్పోవాలి అంటూ తనకు ధైర్యం ఇచ్చారని వెల్లడించింది కియారా అద్వానీ.

also read:Tollywood:టాలీవుడ్‌లో మరో బిగ్ సెలబ్రిటీ విడాకులు.. ఫ్యాన్స్ కి బిగ్ షాక్!?

- Advertisement -
Advertisement

కియారానే ఎందుకు టార్గెట్?

ఈ విషయం పైన పలువురు నెటిజన్స్ సైతం స్పందిస్తూ నటన అనేది కేవలం ఒక వృత్తి అని, భర్త తెరపైన రొమాన్స్ సీన్లు చేయగలిగినప్పుడు భార్య కూడా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్ లలో నటించడం తప్పేం లేదు అంటూ చాలామంది సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది హీరోయిన్స్ కూడా హీరోలతో ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నప్పుడు రాని అభ్యంతరం కియారా చేసేసరికి ఎందుకు వస్తోంది అంటు కామెంట్స్ చేస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you